
ఏదైనా షాపు లేదా హోటల్ కు వెళ్లే ముందు చాలామంది గూగుల్ లో రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూస్తుంటారు. ఇది చాలా కామన్. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొత్తరకమైన మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మా షాపు లేదా హోటల్ గురించి మంచి రివ్యూ ఇస్తే.. మీకు క్యాష్‌బ్యాక్, గిఫ్ట్ వోచర్లు లేదా డిస్కౌంట్లు లభిస్తాయని స్కామర్లు మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. రివ్యూలు అడగడం కామన్ కదా.. అనుకుని వారు చెప్పింది చేశారంటే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ. అసలు స్కామ్ ఎలా జరుగుతుందంటే..
ఏదైనా కంపెనీ మిమ్మల్ని రివ్యూ ఇవ్వండి.. బదులుగా డబ్బు లేదా బహుమతులు ఇస్తాం అని చెప్తే అది ఫేక్ అని గుర్తించాలి.
తెలియని లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. అలాగే తర్డ్ పార్టీ యాప్స్ ను ఇన్‌స్టాల్ చేయొద్దు.
ఒకవేళ షాపు ఓనర్లు నిజంగా అడిగినట్టు మీకు అనిపిస్తే.. గూగుల్ సెర్చ్ లేదా మ్యాప్స్ లో ఆ షాపు వివరాలు చెక్ చేసుకుని కావాలంటే అక్కడ రివ్యూ ఇవొచ్చు. అంతేకానీ రేటింగ్ ఇవ్వడానికి లింక్ లు ఓపెన్ చేయాల్సిన పని లేదు.
ఒక వేళ మీరు ఏదైనా సైబర్ మోసానికి గురైతే.. మీ డబ్బుని తిరిగి పొందడానికి వెంటనే.. బ్యాంక్ లేదా యూపీఐ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. అలాగే సైబర్ క్రైమ్ పోర్టల్ (cybercrime.gov.in)లో లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. కాల్ రికార్డింగ్‌లు, స్క్రీన్‌షాట్‌లు వంటివి సేవ్ చేసి ఉంచుకోండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి