AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Veo 3: యూట్యూబ్ కొత్త ఫీచర్.. ఇకపై ఏఐ వీడియోలతో అదరగొట్టొచ్చు!

యూట్యూబ్‌ సంస్థ రీసెంట్ గా నిర్వహించిన ‘మేడ్‌ ఆన్‌ యూట్యూబ్‌’ ఈవెంట్‌లో కొన్ని కొత్త ఏఐ ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో ఫ్రీ ఏఐ వీడియోలతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లున్నాయి. ఇవి ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు చాలా యూజ్ ఫుల్ గా ఉంటాయి. అవేంటంటే..

Google Veo 3: యూట్యూబ్ కొత్త ఫీచర్.. ఇకపై ఏఐ వీడియోలతో అదరగొట్టొచ్చు!
Google Veo3
Nikhil
|

Updated on: Sep 17, 2025 | 5:43 PM

Share

యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.  యూట్యూబ్ లో షార్ట్స్‌, పాడ్‌కాస్ట్‌, లైవ్‌స్ట్రీమింగ్స్ చేసేవాళ్లు ఇకపై కొన్ని ఫ్రీ ఏఐ టూల్స్‌ను వాడుకోవచ్చు. గూగుల్ వియో 3 పేరుతో లాంఛ్ అయిన ఈ టూల్ ఎలా పనిచేస్తుందంటే..

గూగుల్ వియో 3

వియో3 అనేది ఒక ఏఐ వీడియో మోడల్. దీని ద్వారా యూట్యూబ్ క్రియేటర్లు వీడియో బ్యాక్‌గ్రౌండ్లు, సౌండ్‌తో కూడిన క్లిప్‌లను ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. 480పీ క్వాలిటీ వరకూ వీడియోలు ఫ్రీగా జనరేట్ అవుతాయి. ఎక్కువ రెజల్యూషన్ కావాలంటే కొంత చెల్లించాల్సి ఉంటుంది.

ఫీచర్లుఇవే..

క్రియేటర్లు వీడియో క్రియేట్‌ చేసేటప్పుడు టాప్‌లో కుడివైపు కనిపించే  స్పార్కిల్(sparkle) ఐకాన్ పై క్లిక్‌ చేస్తే ఈ ఫీచర్‌ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా స్టిల్ ఫొటోలను వీడియోస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియోలకు ‘పాప్ ఆర్ట్‌’ లేదా ‘ఒరిగామి’ వంటి లుక్స్ ఇవ్వొచ్చు. అంతేకాదు మీకు నచ్చిన ప్రాంప్ట్‌ ద్వారా క్యారెక్టర్‌ డిజైన్, ఇతర ఎఫెక్ట్‌లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. పాడ్ కాస్ట్ లు చేసేవాళ్లు ఈ టూల్ ద్వారా తమ ఫుల్ వీడియోల నుంచి  షార్ట్స్ , క్లిప్స్ ఈజీగా కట్ చేసుకుని అప్ లోడ్ చేసుకోవచ్చు.  వాయిస్ ఓవర్ తో పాడ్ కాస్ట్ చేసేవాళ్లు ఈ ఏఐ టూల్ ద్వారా కస్టమైజ్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు.

ఇకపోతే లైవ్‌స్ట్రీమింగ్ చేసేవాళ్లు కూడా ఈ ఏఐ టూల్ ను పలు రకాలుగా వాడుకోవచ్చు. లైవ్‌స్ట్రీమ్ చేస్తూనే గేమ్స్ ఆడటం, ఆడియన్స్‌తో ఇంటరాక్ట్‌ కావడం చేయొచ్చు. అలాగే ఇక నుంచి క్రియేటర్లు వర్టికల్ గా కూడా లైవ్‌స్ట్రీమ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడా, న్యూజిలాండ్‌ దేశాల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి రావొచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బ్రోకలీ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..
బ్రోకలీ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే నెయ్యి.. డయాబెటిస్ ఉన్నవారికి
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే నెయ్యి.. డయాబెటిస్ ఉన్నవారికి
ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు
ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు
పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే 5ఏళ్లకు ఎంత డబ్బు వస్తుంది
పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే 5ఏళ్లకు ఎంత డబ్బు వస్తుంది
ఈశా గ్రామోత్సవం పూర్తి వివరాలు..
ఈశా గ్రామోత్సవం పూర్తి వివరాలు..
ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరితో నటించాలని ఉంది..
ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరితో నటించాలని ఉంది..
వాష్‌రూమ్‌ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్‌ ఏం చేశాడో తెలుసా!
వాష్‌రూమ్‌ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్‌ ఏం చేశాడో తెలుసా!
జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ!
జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోందో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోందో