NASA: చంద్రుడిపై ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా అడుగులు.. త్రీడీప్రింటర్‌తో ఆ సమయానికి..
ఈ క్రమంలోనే తాజాగా నాసా మరో కీలక దిశగా అడుగు వేస్తోంది. వ్యోమగాములు చంద్రుడిపై నివసించడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందుకోసం చంద్రుడిపై ఇళ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చంద్రుడిపై ఇళ్లు కట్టేందుకు అవసరమైన త్రీడీ ప్రింటర్‌ను చంద్రుడిపైకి పంపించేందుకు నాసా సిద్ధమవుతోంది...
చంద్రుడిపై రహస్యాలను చేధించేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కథల్లో విన్న చందమామను చేరుకోవాలని ప్రపంచదేశాలు ఆతృతతో ఉన్నారు. అందులో భాగంగానే భారత్ తాజాగా చంద్రయాన్ – 3 ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవంపైకి ప్రయోగం చేపట్టిన ఇస్రో అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త అధ్యాయనానికి తెర తీసింది. ఇక చంద్రుడిపై ఎప్పుడైనా మనిషి నివసించాలనే టార్గెట్‌గా శాస్త్రవేత్తలు ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా నాసా మరో కీలక దిశగా అడుగు వేస్తోంది. వ్యోమగాములు చంద్రుడిపై నివసించడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందుకోసం చంద్రుడిపై ఇళ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చంద్రుడిపై ఇళ్లు కట్టేందుకు అవసరమైన త్రీడీ ప్రింటర్‌ను చంద్రుడిపైకి పంపించేందుకు నాసా సిద్ధమవుతోంది. 2040 నాటికి చంద్రుడిపై ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా వచ్చే ఏడాది చంద్రుడిపైకి త్రీడి ప్రింటర్‌ను పంపేందుకు నాసా సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు చంద్రుడిపై అధ్యయనాలు కొంతమేరే ఫలించాయి. చంద్రుడిపై మనుషులు జీవించడానికి అవసరమైన వాతావరణం ఉందా.? లేదా.? అన్ని విషయంలో ఇంకా పరిశోధనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లరావడమే తప్ప అక్కడ దీర్ఘకాలంగా ఉండి పరిశోధనలు చేసింది లేదు. అయితే చంద్రుడిపై మానవ ఆవాసానికి అవసరమైన పరిస్థితులు ఏమేర ఉన్నాయో తెలిసేందుకు వ్యోమగాములు చంద్రుడిపై కొన్ని రోజులు ఉండడమే పరిష్కారమనే ఆలోచనకు వచ్చారు పరిశోధనలు.
ఇందులో భాగంగానే చంద్రుడిపై వ్యోమగాముల కోసం ఇళ్లు నిర్మించే ప్రణాళికలను నాసా సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ప్రచురించింది. ఇందుకోసం కొన్ని పనులను పలు సంస్థలకు సైతం కేటాయిస్తున్నారు. చంద్రుడిపై ఇళ్లను నిర్మించే పనిని నాసా కొన్ని సంస్థలకు కేటాయించింది. చంద్రుడిపై ఆక్సిజన్, ఐరన్, సిలికాన్, అల్యూమినియం వెలికితీసి.. సోలార్ సెల్స్, వైర్లు ఉత్పత్తి చేసే పనులను బ్లూ ఆరిజిన్ కంపెనీకి కేటాయించింది.
చంద్రుడిపై రాళ్లు తొలగించి, మట్టిని గట్టిగా చేయడానికి అవసరమైన మిషిన్స్ అభివృద్ధి బాధ్యతలను రెడ్‌వైర్ అనే సంస్థకు అప్పగించింది. ఇక టెంపరేచర్‌తో సంబంధం లేకుండా స్థిరంగా కొనసాగే రేడియో ఐసోటోపిక్ విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి జెనోపవర్ సిస్టమ్ అనే సంస్థను అప్పగించారు. మరి చంద్రుడిపై నివాసయోగం ఉండాలన్న శాస్త్రవేత్తల కల ఎప్పుడు ఫలిస్తుందో చూడాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..