Google Pixel: మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో వచ్చేసిన గూగుల్ పిక్సెల్ 8 మోడల్స్.. పూర్తి వివరాలివే..
Google Pixel: స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెస్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి. ఇండియన్ మార్కెట్‌లో ఈ ఫోన్ల విక్రయం ప్రారంభమైంది. మేడ్ బై గూగుల్ 2023 హార్డ్ వేర్ లాంచ్ ఈవెంట్‌లో బుధవారం ఈ స్మార్ట్‌ఫోన్లనువ ఇడుదల చేసింది. టెన్సర్ G3 చిప్ ఆధారితంగా పని చేసే ఈ ఫోన్.. 256 జీబీ ఇంటర్నల్ స్టోరీజిని కలిగి ఉన్నాయి.
Google Pixel: స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెస్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి. ఇండియన్ మార్కెట్‌లో ఈ ఫోన్ల విక్రయం ప్రారంభమైంది. మేడ్ బై గూగుల్ 2023 హార్డ్ వేర్ లాంచ్ ఈవెంట్‌లో బుధవారం ఈ స్మార్ట్‌ఫోన్లనువ ఇడుదల చేసింది. టెన్సర్ G3 చిప్ ఆధారితంగా పని చేసే ఈ ఫోన్.. 256 జీబీ ఇంటర్నల్ స్టోరీజిని కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఔట్ ఆఫ్ ది బాక్స్‌తో ఇది పని చేస్తుంది. ఇక పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో రెండూ ఫోటో అన్‌బ్లర్, లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి గూగుల్ ఏఐ ఫీచర్స్‌కు సపోర్ట్ ఇస్తాయి. ఈ ఫీచర్స్‌ను ఏడేళ్లపాటు గూగులే అందించనుంది. ఈ ఫోన్, కెమెరా పూర్తిస్థాయిలో AI టెక్నాలజీ ఆధారితంగా వర్క్ చేస్తుందని పేర్కొంది గూగుల్.
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ధర..
భారతదేశంలో పిక్సెల్ 8 ధర రూ. 75,999గా నిర్ణయించడం జరిగింది. ఇదే ఒకే 128 జీబీ స్టోరేజ్ మోడల్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ హాజెల్, అబ్సిడియన్, రోజ్ కలర్ ఆప్షన్‌లలో విక్రయించడం జరుగుతుంది. ఇక పిక్సెల్ 8 ప్రో 128 జీబీ మోడల్ రూ. 1,06,999 గా నిర్ణయించారు. ఈ ప్రో మోడల్ బే, ఆబ్సిడియన్ రంగులో వస్తుంది. ఈ మొబైల్స్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్‌లు అక్టోబర్ 4వ తేదీ నుంచే ప్రారంభం అయ్యాయి.
ఇకపోతే.. మొదటిసారిగా గూగుల్ తన స్మార్ట్‌వాచ్, పిక్సెల్ వాచ్ 2 ని ఇండియాలో రిలీజ్ చేసింది. ఇది అక్టోబర్ 12 నుంచి అందుబాటులోకి రానుండగా.. దీని ధర రూ. 39,900 గా నిర్ణయించారు.
పిక్సెల్ ఫోన్లపై ఆఫర్స్..
గూగుల్ తన మొబైల్స్‌పై పరిమిత కాల ఆఫర్స్ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బ్యాంక్ ఆఫర్: పిక్సెల్ 8పై ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 8,000 వరకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 3,000 వరకు తగ్గింపునిస్తోంది.
బ్యాంక్ ఆఫర్: పిక్సెల్ 8 ప్రోను ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 9 వేల వరకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 4 వేల వరకు పొందవచ్చు. ఇక విక్సెల్ వాచ్ 2ని కూడా విక్రయానికి తీసుకువచ్చింది గూగుల్. ఏదైనా పిక్సెల్ 8 గానీ, పిక్సెల్ 8 ప్రో గానీ కొనుగోలు చేసి.. పిక్సెల్ వాచ్2 ని కొనుగోలు చేస్తే రూ. 19,999 లకే లభిస్తుంది. అదికాకండా పిక్సెల్ బడ్స్ ప్రోను రూ. 8,999 లకే దక్కించుకోవచ్చు.
Google Pixel 8, Pixel 8 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్..
పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతున్న డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు. Pixel 8 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల పూర్తి-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. Pixel 8 Pro 6.7-అంగుళాల క్వాడ్-HD (1,344×2,992 పిక్సెల్‌లు) రిజల్యూషన్ 120 Hzz కలిగి ఉంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు గూగుల్ నాన్-కోర్ టెన్సర్ G3 చిప్‌సెట్, Titan M2 సెక్యూరిటీ చిప్‌తో ఆధారితమైనవి. 8GB (Pixel 8), 12GB (Pixel 8 Pro) RAM సామర్థ్యం కలిగి ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ 8, 8 ప్రో మోడల్స్ కెమెరా ఫీచర్స్ కూడా అదరహో అనేలా ఉన్నాయి. రెండూ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు.. af/1.68 అపెర్చర్‌తో Samsung GN2 సెన్సార్‌తో అమర్చబడి ఉన్నాయి. పిక్సెల్ 8లో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, సోనీ IMX386 సెన్సార్, f/2.2 ఎపర్చర్ ఉంది. మరోవైపు, పిక్సెల్ 8 ప్రో సోనీ IMX787 సెన్సార్, af/2.8 ఎపర్చర్‌తో 64-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. ప్రో మోడల్‌లో శామ్‌సంగ్ GM5 సెన్సార్, af/1.95 అపెర్చర్‌తో కూడిన మూడవ 48-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా ఉంది. రెండు ఫోన్‌ల ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం f/2.2 ఎపర్చర్‌తో 11-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్లెండెడ్ ఇమేజ్, ఆడియో మ్యాజిక్ ఎరేజర్ కూడా ఉంది. అధునాతన మెషీన్ లెర్నింగ్ ద్వారా ప్రజల శబ్ధాన్ని, గాలి వంటి పరసరాల శబ్ధాన్ని తగ్గించే ఫీచర్ ఇందులో ఉంది. గూగుల్ వీడియో బూస్ట్ ఫీచర్‌ను కూడా ఇస్తోంది.
ఇక హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఆప్షన్స్ విషయానికి వస్తే.. Wi-Fi 6E, 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. హ్యాండ్‌సెట్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, బేరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్, బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Pixel 8, Pixel 8 Pro మొబైల్స్.. 27W, 30W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌నిస్తున్నాయి. 4,575mAh, 5,050mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. గూగుల్ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్‌లు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తాయి. పిక్సెల్ 8 ప్రో బ్యాటరీని 30 నిమిషాల్లో 50 శాతానికి, 100 నిమిషాల్లో 100 శాతానికి ఛార్జ్ అవుతంది. సాధారణ మోడల్ 50 శాతానికి ఛార్జ్ చేయడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..