Moto E7 Power: 19న భారత మార్కెట్లో విడుదల కానున్న ‘మోటో ఈ7 పవర్‘.. అదిరిపోయే ఫీచర్స్‌తో అందుబాటులోకి..

|

Feb 16, 2021 | 5:24 AM

Moto E7 Power Mobile: అమెరికా టాప్ మొబైల్ కంపెనీ మోటోరోలా నుంచి మరో సరికొత్త ఫోన్ ఫిబ్రవరి 19న భారత్‌లో విడుదల కానుంది. ‘మోటో ఈ 7 పవర్ మొబైల్‌’ను 19న విడుదలచేయనున్నట్లు మోటోరోలా..

Moto E7 Power: 19న భారత మార్కెట్లో విడుదల కానున్న ‘మోటో ఈ7 పవర్‘.. అదిరిపోయే ఫీచర్స్‌తో అందుబాటులోకి..
Follow us on

Moto E7 Power Mobile: అమెరికా టాప్ మొబైల్ కంపెనీ మోటోరోలా నుంచి మరో సరికొత్త ఫోన్ ఫిబ్రవరి 19న భారత్‌లో విడుదల కానుంది. ‘మోటో ఈ 7 పవర్ మొబైల్‌’ను 19న విడుదలచేయనున్నట్లు మోటోరోలా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై గతంలో అనేక ఊహగానాలు వినిపించాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. మొబైల్ కంపెనీ మార్కెట్లో నేరుగా ఫోన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది. ఈ మోటో ఈ 7 పవర్ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరాతో వినియోగదారులకు చేరువకానుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో మార్కెట్లోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా మోటో ఈ-సిరీస్‌ను గత ఏడాది సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా మోటో ఈ 7 ప్లస్‌ ఆ తర్వాత.. మోటో ఈ 7 పవర్ తీసుకువచ్చింది.

అయితే ఈ ఫోన్ 19న మధ్యాహ్నం 12 గంటల నుంచి డిజిటల్ మార్కెట్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. అద్భుతమైన స్పెసిఫికేషన్లు ఉండటంతో ఈ ఫోన్‌పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే మోటో ఈ 7 పవర్ స్పెసిఫికేషన్ల గురించి వెల్లడించిన సంస్థ.. ధర గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ధర గురించి స్పష్టత రావాలంటే.. మరో రెండురోజులపాటు ఆగాల్సిందే.

Also Read:

మొబైల్ ప్రియుల మనసు దోచేస్తున్న శామ్‌సంగ్ ఎఫ్ 62.. ధర కూడా అందుబాటులోనే.. మార్కెట్లోకి ఎప్పుడు రానుందంటే..?

మందుబాబులు తస్మాత్ జాగ్రత్త.. అతిగా మద్యం సేవిస్తే డీఎన్ఏలో మార్పులు.. బెంగళూరు సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి!