AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moto G42: మోటోరోలో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. రూ. 14 వేలకే 50 మెగా పిక్సెల్‌ కెమెరా..

Moto G42: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం మోటోరోలో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది .మోటో జీ42 పేరుతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేశారు. జూలై 11 నుంచి ఆన్‌లైన్‌లో సేల్‌ ప్రారంభం..

Moto G42: మోటోరోలో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. రూ. 14 వేలకే 50 మెగా పిక్సెల్‌ కెమెరా..
Narender Vaitla
|

Updated on: Jul 04, 2022 | 8:57 PM

Share

Moto G42: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం మోటోరోలో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది .మోటో జీ42 పేరుతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేశారు. జూలై 11 నుంచి ఆన్‌లైన్‌లో సేల్‌ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కేవలం 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ ఒకే వేరియంట్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 13,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్‌ లభించనుంది. మొత్తం రెండు రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

మోటో జీ42 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమంపై చేస్తుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌ గ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ను అందించారు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. వీటిలో మెయిన్‌ కెమెరా 50 మెగా పిక్సెల్‌ కాగా దీంతో పాటు 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌ అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

కనెక్టెవిటీ విషయానికొస్తే ఇందులో 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఆప్షన్స్‌ ఇచ్చారు. సైడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఈ ఫోన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 20 వాట్స్‌ టర్బోపవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..