ధర, బ్యాటరీ, ఫీచర్లతో పిచ్చెక్కిస్తున్న ANC ఇయర్‌బడ్స్
ఇయర్‌బడ్స్ కొనేటప్పుడు మంచి సౌండ్‌తో పాటు నాయిస్ క్యాన్సలేషన్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లను చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి సదుపాయాలు ఉన్న మోడళ్ల ధర సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.1,799కే ANC, 10mm డ్రైవర్లు, 60 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లతో MOSS Echo Whisper TWS అందుబాటులోకి వచ్చింది.

తక్కువ ధరలో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనాలని చూస్తున్నవారికి కొత్త మోడల్ ఆకట్టుకునే సదుపాయాలతో వచ్చింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు బలమైన సౌండ్, బయటి శబ్దాలను తగ్గించే ANC, స్పష్టమైన కాల్స్ కోసం క్వాడ్-మిక్ ENC ఇందులో ఉన్నాయి. ఒకేసారి రెండు పరికరాలకు అనుసంధానం చేసుకునే అవకాశం కూడా ఉండటం దీని ప్రత్యేకత.
చూడటానికి ప్రీమియం.. వాడటానికి సౌకర్యం
ఈ ఇయర్‌బడ్స్ ఆధునిక రూపంతో వస్తాయి. ఛార్జింగ్ కేస్, బడ్స్ ఫినిషింగ్ ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించారు. చెవుల్లో ఎక్కువసేపు పెట్టుకున్నా ఇబ్బంది కలగకుండా ఎర్గోనామిక్ డిజైన్ ఇచ్చారు. ఆఫీస్, వ్యాయామం, ప్రయాణాలు వంటి సందర్భాల్లో చెవుల నుంచి జారిపోకుండా గట్టిగా ఉండేలా తయారు చేశారు. సౌండ్ విషయానికి వస్తే 10mm డ్రైవర్లు ఉన్నాయి. వీటి ద్వారా పాటల్లో బేస్ బలంగా వినిపించడంతో పాటు గాయకుల గొంతు స్పష్టంగా వినిపించేలా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. రాక్, క్లాసికల్ వంటి విభిన్న రకాల పాటలను వినేందుకు ఇవి ఉపయోగపడతాయి.
60 గంటల బ్యాటరీ
బయటి శబ్దాలను తగ్గించేందుకు ANC సదుపాయం ఉంది. రోడ్లు, బస్సులు వంటి రద్దీ ప్రాంతాల్లో పాటలు వినేటప్పుడు చుట్టుపక్కల శబ్దాల ప్రభావాన్ని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. కాల్స్ కోసం క్వాడ్-మిక్ ENC టెక్నాలజీ ఉండటంతో అవతలి వ్యక్తికి గొంతు స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. బ్యాటరీ విషయంలో సుమారు 60 గంటల వరకు బ్యాకప్ అందిస్తుందని పేర్కొంటున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటంతో తక్కువ సమయంలోనే అవసరమైనంత ఛార్జ్ చేసుకోవచ్చు.
కనెక్టివిటీ పరంగా Bluetooth v6 సపోర్ట్ ఉంది. ముఖ్యంగా డ్యూయల్ డివైస్ పేరింగ్ ద్వారా ఒకేసారి రెండు పరికరాలకు అనుసంధానం చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లో సినిమా చూస్తున్న సమయంలో ఫోన్‌కు కాల్ వస్తే వెంటనే మారే అవకాశం ఉంటుంది. ధర రూ.1,799గా ఉండటంతో ANC, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, రెండు పరికరాల అనుసంధానం వంటి సదుపాయాలను తక్కువ ఖర్చులో కోరుకునేవారికి ఇది అందుబాటులో ఉన్న ఒక బడ్జెట్ ఎంపిక.
