మీరు ఇతర ఛార్జర్‌తో మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తే ఈ అజాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. తెలిసో తెలియకో ఇలాంటి తప్పులు ఒకసారి కాదు చాలాసార్లు చేస్తుంటాం. దీని కారణంగా భారీగానే నష్టపోవాల్సి ఉంటుంది. మీరు మీ ఫోన్‌ను ఏదైనా ఛార్జర్‌తో ఛార్జ్ చేసినప్పుడు ఫోన్‌కు ఏమి హాని కలుగుతుందో తెలుసుకుందాం.
- స్మార్ట్‌ఫోన్ సమస్యలు: అన్నింటిలో మొదటిది ప్రతి ఫోన్ ఫాస్ట్ ఛార్జ్‌కు సమానంగా మద్దతు ఇవ్వదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫోన్ 18 వాట్ల ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుందనుకోండి. మీరు మరొక కంపెనీ 80 వాట్ల ఛార్జర్‌ని ఉపయోగించి మీ ఫోన్‌ను ఛార్జ్ చేశారని అనుకుందాం. ఇప్పుడు ఈ సందర్భంలో అడాప్టర్ వాటేజ్ ఫోన్ మద్దతు ఉన్న వాటేజ్ కంటే ఎక్కువగా ఉంటే ఫోన్ పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- బ్యాటరీ డ్యామేజ్: అలాగే మీరు ఫోన్‌తో పాటు వచ్చిన ఒరిజినల్ ఛార్జర్‌తో కాకుండా ఏదైనా కంపెనీకి చెందిన ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేస్తే, మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంది.
- వేడెక్కడం, అగ్ని ప్రమాదం: అసలు ఛార్జర్‌కు బదులుగా వేరొకరి ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ వేడెక్కడానికి కారణం కావచ్చు. అంతే కాదు ఒరిజినల్ ఛార్జర్ ఇంట్లోనే మరిచిపోయి లోకల్ కంపెనీకి చెందిన ఛార్జర్ తో రోజూ ఫోన్ ఛార్జింగ్ పెడితే ఫోన్ బ్యాటరీ పాడైపోయి ఫోన్ మంటలు చెలరేగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
- తక్కువ బ్యాటరీ కెపాసిటీ: ఛార్జర్ ఫోన్‌కి అనుకూలంగా లేకుంటే, మీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు. దీని వల్ల బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుంది.
- స్క్రీన్, హార్డ్‌వేర్ సమస్యలు: ఫోన్‌తో రిటైల్ బాక్స్‌లో వచ్చిన ఛార్జర్‌కు బదులుగా స్థానిక ఛార్జర్ లేదా మరొక కంపెనీ ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జింగ్ చేయడం వల్ల ఫోన్ స్క్రీన్, హార్డ్‌వేర్ దెబ్బతింటుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి