AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Microsoft WordPad: వర్డ్‌ప్యాడ్‌కు మైక్రోసాఫ్ట్ స్వస్తి! మరి ప్రత్యామ్నాయం ఏంటి? వివరాలు ఇవి..

ఇకపై వచ్చే ఓఎస్ అప్ డేట్లలో వర్డ్ ప్యాడ్ ఉండదని పలు ఆన్ లైన్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వర్డ్‌ప్యాడ్ అప్లికేషన్‌ 1995 నుంచి విడుదలైన ప్రతి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రధానంగా ఉండే అప్లికేషన్. అయితే ఇకపై రానున్న అప్ డేట్లలో అది కనిపించకపోవచ్చు. అయితే మరి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? వినియోగదారులు దేనిని వినియోగించుకోవాలి? తెలుసుకుందాం రండి..

Microsoft WordPad: వర్డ్‌ప్యాడ్‌కు మైక్రోసాఫ్ట్ స్వస్తి! మరి ప్రత్యామ్నాయం ఏంటి? వివరాలు ఇవి..
Microsoft
Madhu
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 10, 2024 | 3:51 PM

Share

గ్లోబల్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా వినియోగదారులకు సేవలందిస్తున్న వర్డ్‌ప్యాడ్ ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై వచ్చే ఓఎస్ అప్ డేట్లలో వర్డ్ ప్యాడ్ ఉండదని పలు ఆన్ లైన్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వర్డ్‌ప్యాడ్ అప్లికేషన్‌ 1995 నుంచి విడుదలైన ప్రతి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రధానంగా ఉండే అప్లికేషన్. అయితే ఇకపై రానున్న అప్ డేట్లలో అది కనిపించకపోవచ్చు. అయితే మరి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? వినియోగదారులు దేనిని వినియోగించుకోవాలి? తెలుసుకుందాం రండి..

ఎవరు చెప్పారంటే..

సత్య నాదెళ్ల నేతృత్వంలోని కంపెనీ కొత్త విండోస్ బిల్డ్‌ల నుంచి వర్డ్‌ప్యాడ్ యాప్‌ను శాశ్వతంగా తీసివేయాలని నిర్ణయించిందని విండోస్ ఇన్ సైడర్ బ్లాక్ తన పోస్టులో తెలిపింది. లేటెస్ విండోస్ 11 కానరీ చానల్ బిల్ట్ తీసుకొచ్చిన నేపథ్యంలో దీనిలో వర్డ్ ప్యాడ్ లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆ సంస్థ చేసిన బ్లాగ్ లో ఈ కొత్త విండోస్11 బిల్ట్ లో వర్డ్ ప్యాడ్, పీపుల్ యాప్స్ ఇందులో ఉండవని చెప్పింది. ఇకపై వచ్చే అప్ డేట్లలో కూడా ఈ వర్డ్ ప్యాడ్ ఉండే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ యాప్ రీ ఇన్ స్టాల్ కూడా కాదనీ.. దీనిని తొలగించిన జాబితాలో చేర్చినట్లేనని చెప్పింది.

నోట్ ప్యాడ్ ఉంటుంది.

అయినప్పటికీ, వర్డ్ ప్యాడ్ అభిమానులకు శుభవార్త ఉంది. విండోస్ 11 స్టేబుల్ వెర్షన్ నుంచి ఎంఎస్ వర్డ్ ప్యాడ్ ఇంకా తొలగించలేదు. ప్రస్తుతం కొత్త మార్పులు బీటా వెర్షన్లు, డెవలపర్ చానెళ్లలో మాత్రమే వచ్చాయి. గిజ్మోడో నుంచి వచ్చిన ఒక నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ రైట్‌ తర్వాత వచ్చిన యాప్ వర్డ్ ప్యాడ్. ఇది ప్రారంభంలో రెండు కీలక మార్గాల్లో వినియోగదారులకు ఉపయోగపడింది. ఎంఎస్ వర్డ్ ఫంక్షన్లతో కూడిన టెక్ట్స్ ఎడిటర్, నోట్‌ప్యాడ్ అడ్వాన్స్ వెర్షన్ కింద వచ్చింది. అయితే ఈ వర్డ్ ప్యాడ్ ని విండోస్ 11 నుంచి తొలగించనుండటంతో ప్రస్తుతానిక నోట్ ప్యాడ్ కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

ప్రత్యామ్నాయం ఏమిటి?

మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్యాడ్ ను 2023, సెప్టెంబర్ నుంచే తొలిగించిన జాబితాలో చేర్చారు. వినియోగదారులను ప్రత్యామ్నాయాలను వినియోగించుకోవాలని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది. ఎంస్ వర్డ్, నోట్ ప్యాడ్ లను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది. .doc, .rtf వంటి రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్‌ల కోసం మైక్రోసాఫ్ట్ వర్డ్, .txt వంటి సాదా వచన పత్రాల కోసం విండోస్ నోట్ ప్యాడ్ ను వినియోగించాలని సిఫార్సు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్టులో తెలపింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..