Microsoft: సెకనుకు 579 పాస్‌వర్డ్‌లపై హ్యాకర్ల దాడి.. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్న మైక్రోసాఫ్ట్‌..!

Microsoft: టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతమున్న రోజుల్లో సోషల్‌ మీడియా, ఇతర యూపీఐ యాప్స్‌, మరికొన్ని రకాల యాప్స్‌ను చాలా మంది..

Microsoft: సెకనుకు 579 పాస్‌వర్డ్‌లపై హ్యాకర్ల దాడి.. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్న మైక్రోసాఫ్ట్‌..!
Microsoft
Follow us
Subhash Goud

|

Updated on: Sep 17, 2021 | 8:29 AM

Microsoft: టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతమున్న రోజుల్లో సోషల్‌ మీడియా, ఇతర యూపీఐ యాప్స్‌, మరికొన్ని రకాల యాప్స్‌ను చాలా మంది వాడుతుంటారు. మనకు సంబంధించిన ఫోటోలను, డాక్యుమెంట్లను, ఇతర సీక్రెట్‌ అంశాలను స్మార్ట్‌ఫోన్లలో, లేదా ఆన్‌లైన్‌ యాప్స్‌లో, ఇతరులనుంచి రక్షణ పొందేందుకుగాను ఆయా యాప్స్‌కు, ఆన్‌లైన్‌ సర్వీసులకు పాస్‌వర్డ్‌లను కచ్చితంగా ఏర్పాటుచేస్తాం. అలాగే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తోనో, లేక పిన్‌తో బలమైన పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేసుకుని భద్రపర్చుకుంటాము. కానీ హ్యాకర్లు టెక్నాలజీని ఉపయోగించుకుని సులువుగా ట్రేస్‌ చేసి ఆయా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని లాగేసుకుంటున్నారు. వివిధ రకాల యాప్స్‌లలో ఎలాంటి పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసినా.. హ్యాకర్లు సులువుగా దాడి చేస్తున్నారు.

సెకనుకు 579పాస్‌వర్డ్‌లపై దాడి..!

మనం ఎంత బలమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసిన హ్యాకర్లు వాటిని సులభంగా ట్రేస్‌ చేసి సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ప్రతి సెకనుకు 579 పాస్‌వర్డ్‌లపై హ్యాకర్లు దాడి చేస్తోన్నట్లు మైక్రోసాఫ్ట్‌ తన నివేదికలో వెల్లడించింది. ఒక ఏడాది చూసుకుంటే మొత్తంగా 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు జరుగుతున్నాయని తెలిపింది.

మైక్రోసాఫ్ట్‌ కొత్త టెక్నాలజీ..

కాగా, హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలిస్తుండటంతో ఎంతో నష్టం జరిగిపోతుంది. ఇక పాస్‌వర్డ్‌లకు స్వస్తి పలుకుతూ కొత్త రకం టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ భావిస్తోంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసింది. ఇకపై పాస్‌వర్డ్స్‌ లేకుండా మైక్రోసాఫ్ట్‌ యాప్స్‌లో, అకౌంట్‌లో లాగిన్‌ అయ్యేలా మైక్రోసాఫ్ట్‌ దృష్టిసారించింది. పాస్‌వర్డ్స్‌లకు స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్‌ అథనిటికేటర్‌, విండోస్‌ హలో, లేదా వెరిఫికేషన్‌ కోడ్‌ ద్వారా లాగిన్‌ అయ్యే విధానాలను మైక్రోసాఫ్ట్‌ తీసుకురావాలని భావిస్తోంది. ఈ లాగిన్‌ ఫీచర్‌ విధానంతో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన యాప్స్‌కు వర్తించేలా చేయనుంది. అందులో ఔట్‌లూక్‌,వన్‌డ్రైవ్‌, మైక్రోసాఫ్ట్‌ ఫ్యామిలీ సెఫ్టీ, ఇతర మైక్రోసాఫ్ట్‌ యాప్స్‌కు ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

పాస్‌వర్డ్‌ లేకుండా లాగిన్‌ అయ్యే ఫీచర్‌:

ఎంత బలమైన పాస్‌వర్డ్‌ పెట్టుకున్నా.. హ్యాకర్లు దాడులకు పాల్పడుతుండటంతో పాస్‌వర్డ్స్‌ లేకుంగా లాగిన్‌ అయ్యే ఫీచర్‌ను 2019లో విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో కమర్షియల్‌ యూజర్స్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌ యూజర్లు యూజర్లు అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ ఆప్షన్‌ల, అడిషనల్‌ సెక్యూరిటీ ఆప్షన్స్‌లో పాస్‌వర్డ్‌​లెస్‌ అకౌంట్‌ ఆప్షన్‌ను టర్నఆన్‌ చేయడం ద్వారా మైక్రోసాఫ్ట్‌ అథనికేటర్‌ యాప్స్‌నుంచి వచ్చే ఆన్‌స్క్రీన్‌ ప్రామ్ట్స్ తో లాగిన్‌ కావచ్చు. ఈ ఫీచర్‌ ప్రస్తుతం కమర్షియల్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక అందరికి కూడా పాస్‌వర్డ్‌తో పని లేకుండా కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది మైక్రోసాఫ్ట్‌.

ఇవీ కూడా చదవండి: Smartphone: మొబైల్‌ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు.. కారణం ఏంటంటే..!

Zoom App: జూమ్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్‌..12 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్‌.. ఎప్పటి నుంచి అందుబాటులో అంటే..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?