Twitter vs Threads: ఎలాన్ మస్క్ వర్సెస్ జూకర్ బర్గ్.. సంచలనం సృష్టిస్తున్న థ్రెడ్స్ యాప్.. ట్విట్టర్ నుంచి జంప్ అవుతున్న నెటిజన్లు..!
ఎలాన్ మస్క్ వర్సెస్ జూకర్ బర్గ్.. వెబ్ దునియాలో వీళ్లిద్దరి మధ్య విపరీతమైన ఫైటింగ్. ఇప్పుడు కూడా నువ్వా నేనా అన్నట్టుగా వార్ నడుస్తోంది. ట్విట్టర్‌కి పోటీగా.. సరికొత్త యాప్ క్రియేట్ చేశాడు జూకర్ బర్గ్. దాని పేరే థ్రెడ్స్.. ఇది ఇప్పుడు వెబ్ దునియాలో సంచలనంగా మారింది. ఇన్నాళ్లూ బుల్లిపిట్టనే అంటిపెట్టుకున్న నెటిజెన్లు..

ఎలాన్ మస్క్ వర్సెస్ జూకర్ బర్గ్.. వెబ్ దునియాలో వీళ్లిద్దరి మధ్య విపరీతమైన ఫైటింగ్. ఇప్పుడు కూడా నువ్వా నేనా అన్నట్టుగా వార్ నడుస్తోంది. ట్విట్టర్‌కి పోటీగా.. సరికొత్త యాప్ క్రియేట్ చేశాడు జూకర్ బర్గ్. దాని పేరే థ్రెడ్స్.. ఇది ఇప్పుడు వెబ్ దునియాలో సంచలనంగా మారింది. ఇన్నాళ్లూ బుల్లిపిట్టనే అంటిపెట్టుకున్న నెటిజెన్లు.. ఇప్పుడు ఎగిరిపోయి.. థ్రెడ్స్ యాప్‌లో వాలిపోతున్నారు. దాని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.
సోషల్ మీడియాను ఇప్పటికే బోలెడు యాప్స్ షేక్ చేస్తున్నాయి. వాటిల్లో ఫేస్‌బుక్, ఇన్ స్టా, వాట్సాప్ తర్వాత ఎక్కువ క్రేజ్ ఉన్న యాప్.. ట్విట్టర్. పిట్ట కొంచెమే అయినా.. దాని కూత చాలా ఘనం. అయితే ట్విట్టర్‌ను కంట్రోల్‌లోకి తీసుకున్న ఎలాన్ మస్క్.. ఎన్నో మార్పులు చేయడంతో పాటు కొన్ని కండీషన్స్ పెట్టాడు. అవి యూజర్లకు ఇబ్బందికరంగా మారాయి. వేరే ఆప్షన్ లేకపోవడంతో అలాగే వాడుతూ వస్తున్నారు నెటిజెన్లు.
ఇప్పుడు ట్విట్టర్‌కు పోటీగా.. థ్రెడ్స్ యాప్ తీసుకొచ్చారు మార్క్ జూకర్‌బర్గ్… హై ఎండ్ ఫీచర్స్‌తో ట్విట్టర్‌కి అచ్చుగుద్దినట్టుగా ఉందీ యాప్. ఇది అందుబాటులోకి వచ్చిన నిముషాల్లోనే రికార్డ్ స్థాయిలో యూజర్లను ఆకర్షించింది. యాప్ లాంచ్ చేసిన 2 గంటల్లోనే 20 లక్షల మంది లాగిన్ అయ్యారు. 4గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలు దాటింది. ప్రస్తుతం 100కి పైగా దేశాల్లో యాప్ అందుబాటులో ఉంది. యూరప్ దేశాల్లో రూల్స్ కారణంగా అక్కడ లాంచ్ చేయడానికి కొంత సమయం పడుతుందని మెటా కంపెనీ తెలిపింది.




ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌తోనే ఇందులో లాగిన్ అవ్వొచ్చు. టెక్స్ట్, లింక్స్, ఫోటోలు షేర్ చేయవచ్చు. అలాగే 5 నిమిషాల వరకు నిడివి ఉన్న వీడియోలు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ట్విట్టర్‌లో 280 అక్షరాలు మాత్రమే రాసుకోవచ్చు. అదే థ్రెడ్స్ యాప్ అయితే 500 అక్షరాల వరకు పోస్ట్ చేయవచ్చు. అంటే ట్విట్టర్‌తో పోలిస్తే డబుల్. ఇక డబ్బులు చెల్లిస్తేనే ట్విట్టర్‌లో వెరిఫైడ్ యూజర్ టిక్ ఇస్తారు. కానీ థ్రెడ్స్ యాప్ పూర్తిగా ఉచితం. బ్లూటిక్ లేని వాళ్లు రోజుకు 1000 ట్వీట్లు మాత్రమే చూడగలరు. అదే ఇక్కడైతే ఎన్ని పోస్ట్‌లైనా చూడొచ్చు. ట్విట్టర్‌తో పోలిస్తే.. ఈ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది.
ఈ యాప్ లాంఛ్ చేసిన తర్వాత ట్విట్టర్‌లో జూకర్‌బర్గ్ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. 1967 నాటి స్పైడర్ మ్యాన్ కార్టూన్ ను పోస్టు చేశాడు జుకర్ బర్గ్. దానికి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకపోవడం కొసమెరుపు. మొత్తానికి 11ఏళ్ల తర్వాత.. ఎలాన్ మస్క్‌ను టార్గెట్ చేస్తూ.. ట్వీట్ చేశారు ఫేస్‌బుక్ సీఈవో.
ఇది పూర్తిగా ట్విట్టర్‌కు పోటీగానే తెచ్చారు ఎలాన్ మస్క్. కొన్ని రోజుల్లోనే ట్విట్టర్‌కి మించిన యూజర్లు థ్రెడ్స్‌లో ఎంగేజ్ అవుతారని మెటా కంపెనీ ధీమాగా ఉంది. అయితే ట్విట్టర్‌ని కాపీ కొడుతూ ఈ యాప్ తయారు చేశారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనిపై నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నప్పటికీ తనదైన స్టైల్‌లో రిప్లై ఇస్తున్నారు జూకర్‌బర్గ్.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..