Redmi Note-13 Pro: రెడ్‌మీ నోట్‌ 13పై కీలక అప్‌డేట్‌.. ఇండియాలో లాంచింగ్‌ డేట్‌ వచ్చేసిందోచ్చ్‌..!

| Edited By: Janardhan Veluru

Dec 23, 2023 | 1:44 PM

స్మార్ట్‌ఫోన్ల ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌ గురించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. సెప్టెంబర్‌లో చైనాలో రిలీజైన రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 4న భారతదేశంలో లాంచ్ కానున్నాయి. చైనాలో రిలీజైన స్పెసిఫికేషన్ల మాదిరిగానే భారతదేశంలో కూడా అదే స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో యూరోపియన్ మార్కెట్‌లలో హ్యాండ్‌సెట్‌ల అంచనా ధర ఆన్‌లైన్‌లో కనిపించింది. దానికి అనుగుణంగా టెక​ నిపుణులు భారతదేశలో రెడ్‌మీ నోట్‌ 13 ఫోన్ల ధరలను అంచనా వేస్తున్నారు.

Redmi Note-13 Pro: రెడ్‌మీ నోట్‌ 13పై కీలక అప్‌డేట్‌.. ఇండియాలో లాంచింగ్‌ డేట్‌ వచ్చేసిందోచ్చ్‌..!
Redmi Note 13r Pro
Follow us on

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్‌ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌కు కీలకంగా మారింది. అమెరికా, చైనా తర్వాత స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా ఇండియాలోనే అమ్ముడవుతాయి. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను రిలీజ్‌ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌ గురించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. సెప్టెంబర్‌లో చైనాలో రిలీజైన రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 4న భారతదేశంలో లాంచ్ కానున్నాయి. చైనాలో రిలీజైన స్పెసిఫికేషన్ల మాదిరిగానే భారతదేశంలో కూడా అదే స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో యూరోపియన్ మార్కెట్‌లలో హ్యాండ్‌సెట్‌ల అంచనా ధర ఆన్‌లైన్‌లో కనిపించింది. దానికి అనుగుణంగా టెక​ నిపుణులు భారతదేశలో రెడ్‌మీ నోట్‌ 13 ఫోన్ల ధరలను అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రెడ్‌మి నోట్ 13 ప్రో భారతదేశంలో 12 జీబీ + 256 జీబీ వేరియంట్ కోసం రూ.32,999 ఉంటుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రో మెడల్స్‌తో పాటు లాంచ్‌ ఈ సిరీస్‌లోని ఇతర రెండు మోడల్స్ బేస్ రెడ్‌మి నోట్ 13, రెడ్‌మి నోట్ 13 ప్రో+ ధరలు కూడా అంచనా వేయలేదు. చైనాలో రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 8 జీబీ + 128 జీబీ ధర సుమారు రూ. 17,400 నుంచి ప్రారంభమవుతుంది. ఇది నాలుగు ఇతర ర్యామ్‌, స్టోరేజ్ వేరియంట్స్‌లో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంది. 8 జీబీ + 256జీబీ, 12 జీబీ+ 256 జీబీ, 12 జీబీ + 512 జీబీ, 16 జీబీ + 512 జీబీ వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ మోడల్స్‌ ఫోన్లు బ్లాక్, బ్లూ, సిల్వర్, వైట్ కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. 

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ఫీచర్లు ఇవే

రెడ్‌ మీ నోట్‌ 13 ప్రో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో అందుబాటులో ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 7 ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ముఖ్యంగా కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌  200 మెగాపిక్సెల్ సామ్‌సంగ్‌ ఐసోసెల్‌ హెచ్‌పీ 3 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 8 ఎంపీ సెన్సార్  2 ఎంపీ మాక్రో సెన్సార్ ఆకర్షణీయంగా ఉంటుంది.అలాగే సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌ 67 వాట్స్‌ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకతలుగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..