AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi 12C: మార్కెట్‌లోకి ఎంఐ న్యూ ఫోన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాకవుతారంతే..!

ముఖ్యంగా భారతదేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ సంస్థ తాజాగా మరో స్మార్ట్ ఫోన్‌తో మన ముందుకు వచ్చింది. రెడ్‌మీ 12 సీ పేరుతో లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుదని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 4 జీబీ +64 జీబీ, 6 జీబీ +128 జీబీ వేరియంట్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Redmi 12C: మార్కెట్‌లోకి ఎంఐ న్యూ ఫోన్.. ధర, ఫీచర్లు తెలిస్తే షాకవుతారంతే..!
Redmi 12 C
Nikhil
|

Updated on: Jun 18, 2023 | 6:00 PM

Share

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. కచ్చితంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో? అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో అనుహ్యంగా పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని కంపెనీలు ఎప్పకటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ సంస్థ తాజాగా మరో స్మార్ట్ ఫోన్‌తో మన ముందుకు వచ్చింది. రెడ్‌మీ 12 సీ పేరుతో లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుదని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 4 జీబీ +64 జీబీ, 6 జీబీ +128 జీబీ వేరియంట్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వర్చువల్ మెమరీతో కలిపి ఈ ఫోన్ 7 జీబీ ర్యామ్‌తో వస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. లావెండర్ పర్పుల్, మింట్ గ్రీన్, మ్యాట్ బ్లాక్, రాయల్ బ్లూ షేడ్స్‌తో ఈ ఫోన్ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ఫోన్ ధర ఇతర ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

రెడ్‌మీ 12 సీ ఫీచర్లు ఇవే

  • 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 120 హెచ్‌జెడ్ శాంప్లింగ్ రేట్
  • 500 నిట్స్ బ్రైట్‌నెస్
  • ఐపీ 52 ద్వారా వాటర్, డస్ట్ రెసిస్టెంట్
  • మీడియా టెక్ హీలియో జీ 85 ప్రాసెసర్
  • సెపరేట్ మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా 1 టీబీ వరకూ మోమరీని విస్తరించే అవకాశం
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ద్వారా ఫోన్ రన్నింగ్
  • 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4 జీబీ +64 జీబీ వేరింట్ ధర రూ.8799గా ఉంటే 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.10,799గా ఉంది. అయితే ఐడీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా తగ్గింపు ఆఫర్ వస్తుంది. 

మరిన్ని  బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us