Diabetes Research: వారెవ్వా.. డయాబెటిస్ రీసెర్చ్‌లో కీలక అప్‌డేట్.. ఏఐ ద్వారా మధుమేహం కంట్రోల్..!

ఇటీవల మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మధుమేహం చికిత్స పద్ధతులను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లను ఉపయోగిస్తుంది. ఫౌండేషన్ పరిశోధన చేయడానికి సాంకేతిక సంస్థ ఎంబెడ్ యూఆర్ సిస్టమ్స్‌తో జతకట్టింది. ఎండీఆర్ఎఫ్ ఛైర్మన్ వి. మోహన్ ఈ ప్రయోగం గురించి మాట్లాడుతూ సంస్థ నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) ప్యాచ్‌లను ఉపయోగిస్తున్న వారి నుంచి సేకరించిన డేటాపై ఆధారపడుతుందని వారు రోజు మొత్తంలో గ్లూకోజ్ వైవిధ్యాలను ట్రాక్ చేయడం ద్వారా మరింత మెరుగ్గా సేవలను అందించగలరని తెలిపారు.

Diabetes Research: వారెవ్వా.. డయాబెటిస్ రీసెర్చ్‌లో కీలక అప్‌డేట్.. ఏఐ ద్వారా మధుమేహం కంట్రోల్..!
Diabetis Research

Updated on: May 28, 2024 | 8:00 AM

భారతదేశంలో మారుతున్న ఆహార అలవాట్లతో జీవన శైలి కారణంగా మధుమేహం వ్యాధి అని సర్వసాధారణమైపోయింది. ఈ మధుమేహం ఓ సారి వచ్చిందంటే జీవితాంతం పోదనే నానుడి ఉంది. ఈ నేపథ్యంలో మధుమేహ నివారణకు శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇటీవల మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మధుమేహం చికిత్స పద్ధతులను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లను ఉపయోగిస్తుంది. ఫౌండేషన్ పరిశోధన చేయడానికి సాంకేతిక సంస్థ ఎంబెడ్ యూఆర్ సిస్టమ్స్‌తో జతకట్టింది. ఎండీఆర్ఎఫ్ ఛైర్మన్ వి. మోహన్ ఈ ప్రయోగం గురించి మాట్లాడుతూ సంస్థ నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) ప్యాచ్‌లను ఉపయోగిస్తున్న వారి నుంచి సేకరించిన డేటాపై ఆధారపడుతుందని వారు రోజు మొత్తంలో గ్లూకోజ్ వైవిధ్యాలను ట్రాక్ చేయడం ద్వారా మరింత మెరుగ్గా సేవలను అందించగలరని తెలిపారు. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ తాజా ప్రయోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఈ ప్రయోగాల్లో రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులు టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్‌ను అంచనా వేయడంలో సహాయపడతాయో? లేదో? కనుగొనడం లక్ష్యాలలో ఒకటి. డేటా సంక్లిష్టతలను అంచనా వేయడంపై సమాచారాన్ని అందించగలదని డాక్టర్ మోహన్ చెప్పారు. ఎండీఆర్ఎఫ్ తన రోగులకు ఇచ్చిన సీజీఎం సిస్టమ్‌ల నుంచి దాని రీడింగ్‌ల డేటాసెట్‌ను ఎంబెడ్‌యూఆర్‌తో పంచుకుంటుంది. ప్రస్తుతం రక్తంలో చక్కెర స్థాయి అనే ఒక పరామితిని మాత్రమే పరిశీలిస్తామని మోహన్ వివరించారు. వైద్యులు చికిత్స ప్రోటోకాల్‌లను మెరుగుపరచడంలో, సంభవించే సంక్లిష్టతలను అంచనా వేయడంలో సహాయపడే నమూనాల కోసం డేటా ఉపయోగిస్తామని మోహన్ చెప్పారు.

సీజీఎం అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫ్రేమ్‌వర్క్‌ని ఉపయోగించే మెడికల్ ధరించగలిగే పరికరమని నిపుణులు చెబుతున్నారు. డేటాసెట్‌ల నుంచి తక్కువ షుగర్ లేదా హై షుగర్ ఈవెంట్‌ల వంటి మార్కర్‌ల సెట్ సేకరిస్తారు. అలీాగే నమూనాల కోసం విశ్లేషిస్తూ ఉంటారు. కంపెనీలోని ఇంజనీర్లు డేటాను అధ్యయనం చేసి మధుమేహం ఉన్న వ్యక్తికి నిర్దిష్ట మార్కర్లను కలిగి ఉన్న ఆరోగ్య సమస్యలను అంచనా వేయడానికి ఉపయోగించే మోడల్‌ను అభివృద్ధి చేస్తారు. అలాగే పరిశోధకలు ఈ ప్రయోగాల్లో భాగంగా మానవ జన్యు పరిశోధనకు సమాంతరాలను రూపొందించారు. తరువాత మధుమేహాన్ని అధ్యయనం చేయడానికి జన్యుశాస్త్రంలో నాన్-హైపోథెసిస్ ఆధారిత విధానాన్ని ఉపయోగించారు. ఇది అంతకుముందు తప్పిపోయిన కీలక జన్యువులు, మార్గాలను గుర్తించడంలో సహాయపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి