AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karbonn Rebel Pro 4G స్మార్ట్​ఫోన్​ గురించి తెలిస్తే తప్పకుండా షాకవుతారు.. అంతగా ఏముందో తెలుసా?

భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Karbonn మళ్లీ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన కొత్త Rebel సిరీస్‌లో భాగంగా Karbonn Rebel, Karbonn Rebel Pro 4G స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మెరుగైన కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్లను తీసుకొచ్చింది. ముఖ్యంగా క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులను ఆకర్షించేలా Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించింది.

Karbonn Rebel Pro 4G స్మార్ట్​ఫోన్​ గురించి తెలిస్తే తప్పకుండా షాకవుతారు.. అంతగా ఏముందో తెలుసా?
Karbonn Rebel And Rebel Pro 4g
Nikhil
|

Updated on: Nov 08, 2026 | 8:30 PM

Share

Karbonn Rebel, Karbonn Rebel Pro 4G రెండు ఫోన్లను Amazon India ద్వారా ప్రత్యేకంగా విక్రయించనుంది. Karbonn Rebel అసలు ధర రూ.14,999 కాగా, లాంచ్ ఆఫర్‌లో రూ.11,999కు అందుబాటులో ఉంది. దీనిపై రూ.1,000 బ్యాంక్ ఆఫర్ వర్తిస్తే ధర రూ.10,999కు తగ్గుతుంది. మరోవైపు Rebel Pro అసలు ధర రూ.14,999. లాంచ్ ధర రూ.12,499 కాగా, బ్యాంక్ ఆఫర్‌తో రూ.11,499కు కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Karbonn Rebelలో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 650 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. MediaTek Helio G81 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. వెనుకవైపు 50MP AI ప్రధాన కెమెరా ఉంది. ఇక 7,000mAh బ్యాటరీతో పాటు 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఛార్జర్‌ను కూడా బాక్స్‌లో అందిస్తున్నారు. బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

Android 16 ప్రత్యేకతలు

Karbonn Rebel Proలో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఇందులో MediaTek Helio G81 ప్రాసెసర్, వెనుకవైపు 64MP AI డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6,000mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. చెర్రీ రెడ్, గోల్డ్, గ్రే, బ్లూ రంగుల్లో లభిస్తుంది.

ఈ రెండు ఫోన్లలోనూ క్లీన్ Android 16, Google Gemini AI ఇంటిగ్రేషన్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB Type-C పోర్టు ఉన్నాయి. అనవసరమైన థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా జీరో బ్లోట్‌వేర్ అనుభవాన్ని అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. రెండేళ్లపాటు ప్రధాన Android OS అప్‌గ్రేడ్‌లు, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనుంది. ఇదే సిరీస్‌లో Karbonn Rebel 5G మోడల్‌ను కూడా ప్రకటించింది. అయితే దాని ధర, పూర్తి ఫీచర్లు, లాంచ్ తేదీని త్వరలో వెల్లడించనుంది.

Follow Us
Karbonn Rebel Pro 4G స్మార్ట్​ఫోన్​ స్పెషాలిటీస్​ ఇవే
Karbonn Rebel Pro 4G స్మార్ట్​ఫోన్​ స్పెషాలిటీస్​ ఇవే
బోర్డు మార్చడం సులువు.. తరగతి గది మారడమే అసలైన విద్యా సంస్కరణ
బోర్డు మార్చడం సులువు.. తరగతి గది మారడమే అసలైన విద్యా సంస్కరణ
రామాయణ లాగే వారణాసి కూడా.. మహేష్ మూవీ కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్
రామాయణ లాగే వారణాసి కూడా.. మహేష్ మూవీ కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్
ఇంట్లో కాదు.. స్మశానంలోనే దీపావళి వేడుకలు.. ఈ ప్రత్యేక సంప్రదాయం
ఇంట్లో కాదు.. స్మశానంలోనే దీపావళి వేడుకలు.. ఈ ప్రత్యేక సంప్రదాయం
రోజూ ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే చాలు.. శరీరంలో అద్భుత మార్పులు
రోజూ ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే చాలు.. శరీరంలో అద్భుత మార్పులు
ఇస్త్రీ పెట్టె అడుగున పేరుకున్న మురికిని తొలగించే సింపుల్‌ ట్రిక్
ఇస్త్రీ పెట్టె అడుగున పేరుకున్న మురికిని తొలగించే సింపుల్‌ ట్రిక్
ఫస్ట్ టైమ్ కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా.. అచ్చం అమ్మలాగే...
ఫస్ట్ టైమ్ కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా.. అచ్చం అమ్మలాగే...
కోహ్లీ, రూట్‌ కాదు.. అశ్విన్ ఫేవరెట్ ఐదుగురు బ్యాటర్లు వీళ్లే
కోహ్లీ, రూట్‌ కాదు.. అశ్విన్ ఫేవరెట్ ఐదుగురు బ్యాటర్లు వీళ్లే
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. టపాసుల దుకాణంలో మంటలు.. పారిశ్రామిక
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. టపాసుల దుకాణంలో మంటలు.. పారిశ్రామిక
ఈ 4 రాశులకు అదృష్టం.. నవంబర్ 12లోపు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని..
ఈ 4 రాశులకు అదృష్టం.. నవంబర్ 12లోపు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని..