జూమ్‌కు జీయో మీట్‌తో‌ చెక్…

మేడిన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అంటూ ...రిలయన్స్‌ జియో ఓ కొత్త యాప్‌ ను లాంచ్‌ చేసింది. "జియో మీట్‌" వీడియో కాన్ఫరెన్స్‌ పేరుతో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టింది. హెచ్‌డి క్వాలిటీతో ఈ వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ పనిచేస్తుంది....

  • Sanjay Kasula
  • Publish Date - 5:14 pm, Fri, 3 July 20
జూమ్‌కు జీయో మీట్‌తో‌ చెక్...

JioMeet app launched : రిలయన్స్‌ జియో ఓ కొత్త యాప్‌ ను లాంచ్‌ చేసింది. “జియో మీట్‌” వీడియో కాన్ఫరెన్స్‌ పేరుతో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టింది. హెచ్‌డి క్వాలిటీతో ఈ వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ ios ల నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వంద మంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉండటం “జియో మీట్‌”లోని ప్రత్యేకత. గూగుల్‌ క్రోమ్‌, మోజిలా ఫైర్‌ఫాక్స్‌ యూజర్స్‌ డెస్క్‌టాప్‌ నుంచి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.

వీడియో కాలింగ్‌ సర్వీస్‌తో కూడిన యాప్‌ను లాంచ్‌ చేస్తామని గత ఏప్రిల్‌లొనే రిలయన్స్‌ జియో ప్రకటించింది. ఇప్పుడు దీన్ని లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో ఓఎస్‌ 5.0 అంతకంటే ఎక్కువ వర్షన్‌ ఉన్న ఫోన్‌లలో ఇది పనిచేస్తుంది. ios ఫోన్‌లలో 9 అంతకంటే ఎక్కువ వర్షన్‌ ఉన్న ఫోన్‌లలో ఇది పనిచేస్తుంది. డెస్క్‌టాప్‌లో విండోస్‌ 10 లో పనిచేస్తుంది. దీంతో జూమ్‌, గూగుల్‌ మీట్‌, వెబ్‌ ఎక్స్‌ లాంటి యాప్‌లకు జియో మీట్‌ కాన్ఫరెన్స్‌ యాప్‌ పోటీ ఇచ్చే అవకాశం ఉంది.