ఎడిట్‌ ఆప్షన్ ఇస్తాం కానీ.. కండిషన్ పెట్టిన ట్విట్టర్ సంస్థ

ప్రముఖ సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ యూజర్లకు సాధారణంగా ఒక సమస్య ఎదురవుతుంటది. అదేంటంటే ఈ మాధ్యమంలో ఒకసారి పోస్ట్ చేస్తే చాలు..

ఎడిట్‌ ఆప్షన్ ఇస్తాం కానీ.. కండిషన్ పెట్టిన ట్విట్టర్ సంస్థ
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2020 | 1:04 PM

ప్రముఖ సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ యూజర్లకు సాధారణంగా ఒక సమస్య ఎదురవుతుంటది. అదేంటంటే ఈ మాధ్యమంలో ఒకసారి పోస్ట్ చేస్తే చాలు.. దాన్ని ఎడిట్‌ చేయలేము. ట్వీట్‌ మొత్తాన్ని డిలీట్‌ చేసి మళ్లీ కొత్త ట్వీట్‌ని చేయాల్సి ఉంటుంది. దీంతో ఇందులో ఎడిట్‌ ఆప్షన్ ఇవ్వాలని వినియోగదారులు ఎప్పటినుంచో సంస్థను కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్‌ సంస్థ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై ట్విటర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ బటన్‌ను తీసుకువస్తున్నట్లు సంస్థ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రకటించింది.

అయితే ఇందులో ఓ ట్విస్ట్‌ పెట్టింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించినప్పుడే ఎడిట్‌ బటన్‌ని తీసుకువస్తామని సంస్థ వెల్లడించింది. కరోనా విజృంభణను దృష్టిలో పెట్టుకొని ట్విటర్‌ సంస్థ ఈ విధంగా కండిషన్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్వీట్‌కు యూజర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.