ప్రగతి భవన్‌లో పాజిటివ్స్ !..కొత్తగూడెం పోలీసు బెటాలియన్‌లో కలకలం

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణను బెంబేలెత్తిస్తోంది. రెట్టింపు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారి పెరిగిపోయిన పాజిటివ్ కేసుల సంఖ్య హడలెత్తిస్తోంది.

  • Jyothi Gadda
  • Publish Date - 1:00 pm, Sat, 4 July 20
ప్రగతి భవన్‌లో పాజిటివ్స్ !..కొత్తగూడెం పోలీసు బెటాలియన్‌లో కలకలం

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణను బెంబేలెత్తిస్తోంది. రెట్టింపు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారి పెరిగిపోయిన పాజిటివ్ కేసుల సంఖ్య హడలెత్తిస్తోంది. నిన్నటి వరకు వందలలో నమోదైన కేసులు ఒక్కరోజులోనే వేలల్లోకి పెరిగిపోవటం కలవర పెడుతోంది.. నిన్న ఒక్కరోజే 1892 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు నమోదైన వాటిలో ఇంత పెద్దమొత్తంలో వెలుగుచూడడం ఇదే ప్రధమం. మరోవైపు వైరస్ పాజిటివ్ రేటింగ్స్‌ పరంగా చూసుకుంటే దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, జిల్లాలకు కూడా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరస్ చాప నీరులా విస్తరిస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం పాల్వంచలో ఐదుగురికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, శుక్రవారం భద్రాచలం పట్టణానికి చెందిన ఓ జర్నలిస్టుకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. అటు, కొత్తగూడెం సమీపంలోని చాతకొండలో ఉన్న పోలీసు బెటాలియన్‌లో 12 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరంతా హైదరాబాద్‌లో బందోబస్తు విధులు నిర్వహించడానికి వెళ్లొచ్చారని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతి భవన్‌లో విధులు నిర్వర్తించిన వీరు ఇటీవలే కొత్తగూడెం తిరిగొచ్చారని తెలుస్తోంది. కాగా, ప్రగతి భవన్‌లో సిబ్బందికి పెద్ద సంఖ్యలో కరోనా సోకినట్లు తేలడంతో పోలీసు బెటాలియన్‌లోనూ కోవిడ్ టెస్టులు నిర్వహించగా 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన్నట్లు అధికార వర్గాల సమాచారం.