
రిలయన్స్ జియో టెలికాం వినియోగదారులకు గుడ్ న్యూస్. కొత్తగా జియో సిమ్ కార్డ్ తీసుకోవాలనుకొనే వారికి అదిరే ఆఫర్ ను జియో ప్రకటించింది. ఒక నెల పాటు ఫ్రీ పోస్ట్ పెయిడ్ ట్రయల్ ప్లాన్ ను అందిస్తోంది. వీటిలో జియోలో అత్యంత ప్రజాదరణ పొందిన పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఇందులో ఉన్నాయి. దీనిలో రూ. 399, రూ. 699 ఫ్యామిలీ ప్లాన్స్ అలాగే రూ. 599 ఇండివిడ్యూవల్ ప్లాన్స్ ఉన్నాయి. వీటిపై ఉచిత ట్రయల్ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
జియో నెట్‌వర్క్‌ని ప్రయత్నించాలనుకునే కొత్త వినియోగదారులు రూ. 399, రూ. 599, రూ. 699 జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను 30 రోజుల పాటు ఉచితంగా ప్రయత్నించవచ్చు. నెల గడిచిన తర్వాత, వారు టెల్కోతో కొనసాగాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. వీటిలో రెండు కుటుంబ ప్లాన్‌లు, అంటే వినియోగదారులు తమ ప్లాన్‌లకు కుటుంబ సభ్యులను జోడించుకోవచ్చు. ఈ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు అందించే ప్రయోజనాలను చూద్దాం.
జియో రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్.. జియో నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్లలో ఇది కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ ప్లాన్ లో మూడు యాడ్ ఆన్ సిమ్స్ ఉంటాయి. ఒక నెల పాటు ఉచితంగా ఈ ప్లాన్ ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత రూ. 99తో చార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ఒరిజినల్ సిమ్‌కి 75జీబీ డేటా, యాడ్-ఆన్ సిమ్‌లకు ఒక్కొక్కటి అదనంగా 5జీబీని అందిస్తుంది. కేటాయించిన డేటా ముగిసిన తర్వాత, ప్రతి జీబీకి రూ. 10 వసూలు చేస్తుంది. ఇక అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్ లను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు.
జియో రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్.. ఇది ఇండివిడ్యూవల్ ప్లాన్, యాడ్ ఆన్ సిమ్ లను అనుమతించదు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత డేటా, వాయిస్ కాల్‌లను పొందుతారు. అదనంగా, ప్లాన్ రోజుకు 100 ఎస్ఎంఎస్ లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు కాంప్లిమెంటరీగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్ లను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు.
జియో రూ. 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్.. ఇది రూ. 399 ప్లాన్ లాగానే ప్రయోజనాలను అందిస్తుంది. కానీ 100జీబీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు ఉచిత నెట్‌ఫ్లిక్స్ బేసిక్, వార్షిక ప్రైమ్ వీడియో సభ్యత్వాలను కూడా అందిస్తుంది.
మీరు ఇప్పటికే జియో ప్రీపెయిడ్ వినియోగదారు అయితే, మీరు సిమ్‌ని మార్చకుండానే పోస్ట్‌పెయిడ్ ఉచిత ట్రయల్‌కు అప్‌డేట్ చేయవచ్చు. అది ఎలా అంటే..
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..