I Phone 15: ఐఫోన్‌ 15 కొనుగోలుపై జియో అదిరే ఆఫర్‌.. ఏకంగా ఆరు నెలల రీచార్జి ఫ్రీ.. కానీ ఆ ఒక్క పని చేయాల్సిందే..!

|

Sep 24, 2023 | 7:30 PM

తాజాగా సెప్టెంబర్‌ 12న యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 15 ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వీటితో పాటు యాపిల్‌ ఇయర్‌పాడ్స్‌ను కూడా లాంచ్‌ చేసింది. దీంతో ఐఫోన్‌ కోసం వినియోగదారులు ఎగబడ్డారు. అయితే ధర కాస్త ఎక్కువగా ఉండడంతో మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో ఐఫోన్‌ 15 కొనుగోలు ఓ సంచలన ఆఫర్‌ ప్రకటించింది.

I Phone 15: ఐఫోన్‌ 15 కొనుగోలుపై జియో అదిరే ఆఫర్‌.. ఏకంగా ఆరు నెలల రీచార్జి ఫ్రీ.. కానీ ఆ ఒక్క పని చేయాల్సిందే..!
Apple Iphone 15
Follow us on

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లోకి కొత్త మోడల్స్‌ ఫోన్లు ఇబ్బడిముబ్బడిగా లాంచ్‌ అవుతున్నాయి. అయితే ఎన్ని మోడల్స్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నా ఐఫోన్స్‌కు ఉండే క్రేజ్‌ వేరు. ముఖ్యంగా ఐఫోన్‌ వాడకం అనేది యువత ఒక స్టేటస్‌లా ఫీలవుతుంది. ఈ నేపథ్యంలో యాపిల్‌ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు ఐఫోన్‌ను అప్‌డేట్‌ చేస్తూ కొత్త సిరీస్‌ను లాంచ్‌ చేస్తుంది. తాజాగా సెప్టెంబర్‌ 12న యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 15 ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వీటితో పాటు యాపిల్‌ ఇయర్‌పాడ్స్‌ను కూడా లాంచ్‌ చేసింది. దీంతో ఐఫోన్‌ కోసం వినియోగదారులు ఎగబడ్డారు. అయితే ధర కాస్త ఎక్కువగా ఉండడంతో మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో ఐఫోన్‌ 15 కొనుగోలు ఓ సంచలన ఆఫర్‌ ప్రకటించింది. ఐఫోన్‌ 15ను కొనుగోలు చేసిన వారికి ఆరు నెలల ఫ్రీ రీచార్జిను అందిస్తుంది. జియో అందించే ఈ తాజా ఆఫర్‌ పొందాలంటే మాత్రం ఓ మెలిక పెట్టింది. ఐఫోన్‌ 15 కొనుగోలుపై ఫ్రీ రీచార్జ​ పొందాలంటే ఏం చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

ఐఫోన్‌ 15పై ఫ్రీ రీచార్జ్‌ను పొందాలంటే ఐఫోన్‌-15 కచ్చితంగా రిలయన్స్‌ అధికారిక చానెల్స్‌ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా కొనుగోలు చేసిన వారికి మాత్రమే నెలకు రూ.399 విలువైన కాంప్లిమెంటరీ ప్యాక్‌లు ఆరు నెలల పాటు పొందేందుకు అర్హులవుతారు. ఈ ప్లాన్‌ అపరమిత వాయిస్‌ కాలింగ్‌తో వస్తుంది. అంతేకాకుండా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు ముఖ్యంగా ప్రతి రోజు 3 జీబీ డేటాను ఆశ్వాదించవచ్చు. ఈ ప్రయోజనాలన్నీ ప్రస్తుతం రూ.2394 ప్లాన్‌పై ఉన్నాయి. అంటే రిలయన్స్‌ అధికారిక చానెల్స్‌ ద్వారా ఐఫోన్‌ 15 కొనుగోలు చేస్తే రూ.2394 విలువైన రీచార్జ్‌ ప్లాన్స్‌ను పొందవచ్చు. అయితే రూ.149 అంతకంటే తక్కువ ప్రీపెయిడ్‌ యాక్టివేషన్లపై ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండదని వినియోగదారులు గమనించాలి. మీకు ఒకవేళ జియో సిమ్‌ లేకపోయినా మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ ద్వారా కొత్త జియో సిమ్‌ను కొనుగోలు చేసి ఆఫర్‌ను పొందవచ్చు. 

ముఖ్యంగా కొత్త ఐఫోన్‌ -15లో జియో సిమ్‌ వేశాక 72 గంటల్లో ఈ ఆఫర్లు వాటంతట అవే యాక్టివేట్‌ అవుతాయి. ఆఫర్‌ యాక్టివేషన్‌ గురించి కస్టమర్లకు మెసేజ్‌తో పాటు ఈ మెయిల్‌ ద్వారా ధ్రువీకరణ అందిస్తుంది. ఈ ఆఫర​ ఐఫోన్‌-15 తాజా మోడల్స్‌కు మాత్రమే అందిస్తారు. ప్రస్తుతం ఐఫోన్‌-15 ధర రూ.79,990 నుంచి ప్రారంభం అవుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..