iPhone 15: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి ??

iPhone 15: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి ??

Phani CH

|

Updated on: Sep 16, 2023 | 9:56 AM

యాపిల్ లవర్స్ అందరూ ఎంతాగానే ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఎట్టకేలకు మార్కెట్‌లోకి వచ్చింది. సరికొత్త టెక్నాలజీతో తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఐఫోన్‌కు ఇస్రోకి కనెక్షన్ ఉన్నట్లు మీకు తెలుసా..! ఇటీవల విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌ ఇస్రో రూపొందించిన జీపీఎస్ సిస్టమ్ న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టెలేషన్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ యాపిల్ తన ఐఫోన్ మోడల్స్‌లో తీసుకురావడం ఇదే మొదటిసారి.

యాపిల్ లవర్స్ అందరూ ఎంతాగానే ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఎట్టకేలకు మార్కెట్‌లోకి వచ్చింది. సరికొత్త టెక్నాలజీతో తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఐఫోన్‌కు ఇస్రోకి కనెక్షన్ ఉన్నట్లు మీకు తెలుసా..! ఇటీవల విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌ ఇస్రో రూపొందించిన జీపీఎస్ సిస్టమ్ న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టెలేషన్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ యాపిల్ తన ఐఫోన్ మోడల్స్‌లో తీసుకురావడం ఇదే మొదటిసారి. ఈ ఫీచర్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ రెండింటిలోనూ ఉంటుంది. న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టెలేషన్‌ని గతంలో ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌గా పిలిచేవారు. ఇది ఏడు ఉపగ్రహాల సమూహం ద్వారా సేకరించిన సమాచారం ద్వారా పనిచేస్తుంది. భారతదేశపు మొత్తం భూభాగాన్ని కవర్ చేస్తుంది. అంతే కాకుండా జీపీఎస్ కంటే కూడా మంచి ఫలితాలను ఇస్తుందని సమాచారం. మొత్తం మీద దీని ద్వారా లొకేషన్ ట్రాకింగ్ కెపాసిటీ మరింత మెరుగుపడుతుంది. NavIC కేవలం ఐఫోన్ సిరీస్ మొబైల్స్‌కి మాత్రమే కాకుండా రియల్‌మీ 9 ప్రో, వన్ ప్లస్ నార్డ్ 2టీ, షియోమీ ఎమ్ఐ 11ఎక్స్ వంటి వాటిలో కూడా లభిస్తుంది. వినియోగదారులు దీంతో ఉత్తమ్ లొకేషన్ ట్రాకింగ్ అనుభవాన్ని పొందవచ్చు. జీపీఎస్ పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

DSP: మ్యూజిక్‌ లవర్స్‌కు దేవి శ్రీ ప్రసాద్ స్సెషల్ గిఫ్ట్

Pallavi Prashanth: సూసైడ్ అటెంప్ట్‌.. ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటూ.. ప్రశాంత్‌ పేరెంట్స్ ఎమోషనల్

Bigg Boss 7 Telugu: బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ దగ్గర్లో రైతు బిడ్డ

Navadeep: అరెస్ట్ నుంచి కొద్దిలో తప్పించుకున్న నవదీప్‌

Samantha: సమంత బిగ్ ఝలక్ !! ముఖంమీదే నో చెప్పేసిందిగా