I Phone 12: ఐఫోన్ 12పై నిషేధం.. యాపిల్ ఇంక్ కీలక ప్రకటన..!

I Phone 12: ఐఫోన్ 12పై నిషేధం.. యాపిల్ ఇంక్ కీలక ప్రకటన..!

Anil kumar poka

|

Updated on: Sep 17, 2023 | 9:16 AM

అధిక రేడియేషన్ నేపథ్యంలో ఫ్రాన్స్ ఐఫోన్12ను నిషేధించింది. దీంతో యాపిల్ ఇంక్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో అధిక రేడియేషన్ సమస్య పరిష్కారమవుతుందని తెలిపింది. మరోసారి ఫ్రాన్స్‌లో ఐఫోన్12 విక్రయాలకు మార్గం సుగమమవుతుంది. ఈ మోడల్ ఫోన్ యూరోపియన్ యూనియన్ రేడియేషన్ నిబంధలకు విరుద్ధంగా ఉందని ఫ్రాన్స్ నిషేధించడంతో ఈ ప్రభావం యూరోప్ అంతటా ఉంటుందని

అధిక రేడియేషన్ నేపథ్యంలో ఫ్రాన్స్ ఐఫోన్12ను నిషేధించింది. దీంతో యాపిల్ ఇంక్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో అధిక రేడియేషన్ సమస్య పరిష్కారమవుతుందని తెలిపింది. మరోసారి ఫ్రాన్స్‌లో ఐఫోన్12 విక్రయాలకు మార్గం సుగమమవుతుంది. ఈ మోడల్ ఫోన్ యూరోపియన్ యూనియన్ రేడియేషన్ నిబంధలకు విరుద్ధంగా ఉందని ఫ్రాన్స్ నిషేధించడంతో ఈ ప్రభావం యూరోప్ అంతటా ఉంటుందని యాపిల్ ఇంక్ భావించింది. దీంతో సత్వర పరిష్కార చర్యలు చేపట్టింది. ఫ్రెంచ్ రెగ్యులేటర్ ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఫ్రాన్స్‌లోని వినియోగదారుల కోసం తాము సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను జారీ చేస్తామని యాపిల్ ఇంక్ స్పష్టం చేసింది. అధిక రేడియేషన్ నేపథ్యంలో ఐఫోన్12 అమ్మకాలను నిలిపివేసిన ఫ్రాన్స్… యాపిల్ ఇంక్ తాజా నిర్ణయాన్ని స్వాగతించింది. మరికొన్ని రోజుల్లో ఈ ఫోన్ కొత్త అప్ డేట్ వస్తుందని యాపిల్ ఇంక్ తెలిపిందన్నారు డిజిటల్ మినిస్టర్ జీన్ నోయల్ బారోట్. కొత్త సాఫ్ట్‌వేర్ అప్ డేట్‌లో ఉందో లేదో తనిఖీ చేస్తామని డిజిటల్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫ్రాన్స్ తర్వాత బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్ ఐఫోన్12లోని అధిక రేడియేషన్‌పై ఆందోళన వ్యక్తం చేశాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..