Viral: ప్రాణాలు ఫణంగా పెట్టి.. గర్భిణికి అండగా నిలిచిన యూత్..! వీడియో..
తెలంగాణలో కొన్నిజిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితిలో సైతం రాకపోకలు సాగించే పరిస్థితి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో జంపన్నవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఏటూరు నాగారం మండలంలోని అల్లంవారి ఘనపురం, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.
తెలంగాణలో కొన్నిజిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితిలో సైతం రాకపోకలు సాగించే పరిస్థితి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో జంపన్నవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఏటూరు నాగారం మండలంలోని అల్లంవారి ఘనపురం, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ఈ గ్రామాలు ఐటీడీఏకు కూత వేటు దూరంలోనే ఉన్నాయి. అయినా ఇక్కడి ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. ఆయా గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన దబ్బగట్ల సునీత అనే గర్భిణీ ప్రసవవేదనతో బాధపడుతోంది. మరోవైపు జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆస్పత్రికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. పురిటినొప్పులు ఎక్కువై సునీత పడుతున్న అవస్థను చూసి కొందరు యువకులు ముందుకొచ్చారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. వాగు వరకూ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెట్టి మోసుకొచ్చిన యువకులు వాగు దాటించేందుకు ఓ ట్రాక్టర్‌ను బోటులా ఉపయోగించారు. టైరు వాగులో కొట్టుకుపోకుండా నలువైపులా యువకులు రక్షణగా నిలిచారు. ఒక దశలో వారంతా వాగులో మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్తితి ఏర్పడింది. అయినా ధైర్యంగా ఆ గర్భిణీ స్త్రీని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుండి ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గర్భిణీ స్త్రీ సునీత ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వారి ప్రాణాలు ప్రాణంగా పెట్టి తనను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చిన వారికి గర్భిణీ స్త్రీ సునీత కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఈ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..