Jio: యూజర్లకు జియో బంపరాఫర్.. ఒక్క ప్లాన్‌తో 14 ఓటీటీ సేవలు..
ఈ ప్లాన్‌తో జియో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను సైతం అందిస్తోంది. రూ. 398తో జియో కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్‌ను పొందొచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. యూజర్లు రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. అంటే 28 రోజుల్లో మొత్తంగా 56 జీబీ లభిస్తుంది...

టెలికం రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టించిన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా యూజర్లను అట్రాక్ట్ చేస్తూ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. దీంతో టెలికం కంపెనీలు సైతం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌తో కూడిన రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. తాజాగా జియో ఇలాంటి ఓ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది.
ఈ ప్లాన్‌తో జియో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను సైతం అందిస్తోంది. రూ. 398తో జియో కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్‌ను పొందొచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. యూజర్లు రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. అంటే 28 రోజుల్లో మొత్తంగా 56 జీబీ లభిస్తుంది. అంతే కాకుండా అదనంగా 6 జీబీ డేటా కూడా లభించనుంది. దీన్ని వోచర్ల కేటగిరిలో నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ డేటా వోచర్ విలువ రూ.61. కానీ ఈ రూ.398 ప్లాన్‌తో ఫ్రీగా లభిస్తుంది.
ఒకవేళ మీరు 5జీ నెట్‌వర్క్ పరిధిలో ఉంటే అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఈ రీఛార్జ్ ప్లాన్‌తో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన మరో అంశం ఓటీటీ సేవలు. రూ. 398తో రీఛార్జ్ చేసుకుంటే సోనీలివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్‌నెక్స్ట్, కంచా లన్కా, ప్లానెట్ మరాఠీ, చౌపల్, డాక్యుబే, ఎపిక్ ఆన్, హొయ్‌చొయ్, జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ వంటి ఓటీటీ సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..
