Password: మీ పాస్ వర్డ్‌లను ఫోన్‌లో సేవ్ చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే.. ఇవి అస్సలు మిస్ అవ్వొద్దు..
మీ బ్యాంక్ పాస్ వర్డ్, ఏటీఎం పిన్ లను మీ ఫోన్ లో సేవ్ చేస్తున్నారా? మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో వాటిని భద్రం చేస్తున్నారా? అయితే సైబర్ నేరగాళ్లకు మీరు చిక్కినట్లే! పైగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కేవలం నిమిషంలోపే సాధారణ పాస్ వర్డ్ లను హ్యాక్ చేసేస్తుంది.
మీ బ్యాంక్ పాస్ వర్డ్, ఏటీఎం పిన్ లను మీ ఫోన్ లో సేవ్ చేస్తున్నారా? మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో వాటిని భద్రం చేస్తున్నారా? అయితే సైబర్ నేరగాళ్లకు మీరు చిక్కినట్లే! మీ ఖాతా లూటీ అయ్యేందుకు అవకాశం నూటికి నూరు పాళ్లు ఉన్నాయి. పైగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కేవలం నిమిషంలోపే సాధారణ పాస్ వర్డ్ లను హ్యాక్ చేసేస్తుంది. అందుకే సెన్సిటివ్ డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లలో స్టోర్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. కానీ మన దేశంలో చాలా మంది ఇప్పటికీ అటువంటి డేటాను ఫోన్ లోనే సేవ్ చేస్తున్నారట. ఇటీవల మన దేశంలో ఇదే అంశంపై సర్వే చేసిన ఓ సంస్థ దేశంలో దాదాపు 17 శాతం జనాలకు ఇదే అలవాటు ఉందని తేల్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సర్వే ఏం చెప్పిందంటే..
బ్యాంక్ పాస్ వర్డ్, ఏటీఎం పిన్ లను ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లేదా మొబైల్ నోట్స్ లో సేవ్ చేస్తున్నారా లేదా అనే అంశంపై 11,236 మందిని ఆన్ లైన్ కమ్యూనిటీ ప్లాట్ ఫామ్ లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వే చేసింది. దాని రిపోర్ట్ ను బుధవారం ప్రకటించింది. ఆ రిపోర్టు ప్రకారం.. 17 శాతం మంది ఫోన్ లోనే తమ సెన్సిటివ్ డేటా ను సేవ్ చేస్తున్నట్లు చెప్పారు. 30 శాతం మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సహోద్యోగులతో తమ పాస్ వర్డ్ వివరాలు పంచుకుంటున్నట్లు చెప్పారు. అలాగే 88 శాతం మంది ఆధార్ ని వివిధ బుకింగ్స్, అప్లికేషన్స్ లో ప్రూఫ్ కింద షేర్ చేస్తున్నారని వివరించారు. 8 శాతం మంది మొబైల్ నోట్స్ లో తమ సెన్సిటివ్ డేటా ను సేవ్ చేస్తున్నారట. అలాగే 9 శాతం మంది తమ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ లో ఈ డేటాను సేవ్ చేస్తున్నారు. మొత్తం మీద 24 శాతం మంది తమ విలువైన సమాచారాన్ని మొబైల్ ఫోన్ లో నే సేవ్ చేస్తున్నట్లు తేలింది.
కారణం ఏమిటంటే..
ఎందుకంటే మనం డౌన్ లోడ్ చేసుకోనే చాలా యాప్ కి మనం పర్మిషన్లు ఇస్తాం. వాటిల్లో చాలా యాప్స్ మీ కాంటాక్ట్ లిస్ట్, ఇమేజెస్ యాక్సెస్ చేసేందుకు పర్మిషన్లు అడుగుతాయి. వాటిని ఓకే చేసుకుంటూ వెళ్తే.. మీ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతుంది. అదే విధంగా కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) దాదాపు 50 శాతం పాస్ వర్డ్ లను కేవలం నిమిషం లోపే ఛేదించేసింది.. ఈ క్రమంలో మీ పాస్ వర్డ్ ల విషయం నిర్లక్ష్యం వీడాలని, ఖాతాలకు అధిక సామర్థ్యం కలిగిన పాస్ వర్డ్ లను పెట్టుకోవాలని సూచిస్తున్నారు. వాటిని చాలా భద్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..