itel S24: రూ. 10 వేలలోనే 108 ఎంపీ కెమెరా ఫోన్‌.. స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌

|

May 12, 2024 | 8:15 PM

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్‌లో కెమెరా ప్రాధాన్యత పెరుగుతోంది. కెమెరాలకు బదులుగా స్మార్ట్ ఫోన్స్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో చాలా మంది స్మార్ట్ పోన్‌ను ఎంపిక చేసుకునే ముందుకు కెమెరా క్టారిటీని పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే మంచి కెమెరా క్లారిటీ ఉన్న ఫోన్‌ కొనుగోలు చేయాలంటే కచ్చితంగా భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది...

itel S24: రూ. 10 వేలలోనే 108 ఎంపీ కెమెరా ఫోన్‌.. స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌
Itel S24
Follow us on

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్‌లో కెమెరా ప్రాధాన్యత పెరుగుతోంది. కెమెరాలకు బదులుగా స్మార్ట్ ఫోన్స్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో చాలా మంది స్మార్ట్ పోన్‌ను ఎంపిక చేసుకునే ముందుకు కెమెరా క్టారిటీని పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే మంచి కెమెరా క్లారిటీ ఉన్న ఫోన్‌ కొనుగోలు చేయాలంటే కచ్చితంగా భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే బడ్జెట్‌ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కూడిన ఓ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఐటెల్‌ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐటెల్‌ భారత మార్కెట్లోకి ఐటెల్‌ ఎస్‌24 పేరుతో ఓ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 10,999కే సొంతం చేసుకోవచ్చు.దీంతో పపాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 10వేల లోపే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఐటెల్ ఎస్‌24 స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఐపీఎస్‌ డిస్‌ప్లేను అందించారు. పంచ్‌ హోల్‌ డిజైన్‌తో ఈ డిస్‌ప్లేను డిజైన్ చేశారు. 120 హెచ్‌జెడ్‌ టచ్‌ సాంప్లింగ్‌ రేట్‌ను అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్స్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌ను అందించారు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్లూటూత్‌, వైఫై, యూఎస్‌ఎబీ వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో హీలియో జీ91 ప్రాసెసర్‌ను ఇచ్చారు. అలాగే డ్యూయల్‌ డీటీఎస్‌ స్పీకర్స్‌ను ఇచ్చారు. సైడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఈ ఫోన్‌ సొంతం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..