Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Shukrayaan: ఇస్రోనా మాజాకా..! మిషన్ శుక్రయాన్‌కు భారత్ సిద్ధం.. ప్రయోగం ఎందుకో తెలుసా

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తొలి అడుగులు వేసే నాటికి అమెరికా, రష్యా లాంటి దేశాలు ఎన్నో అద్భుతాలను సొంతం చేసుకున్నాయి.. ఆలస్యంగా అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత్ కు చెందిన ఇస్రో తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలు అబ్బురపోయే అద్భుతాలను సాధించి సత్తా చాటింది.

ISRO Shukrayaan: ఇస్రోనా మాజాకా..! మిషన్ శుక్రయాన్‌కు భారత్ సిద్ధం.. ప్రయోగం ఎందుకో తెలుసా
ISRO
Follow us
Ch Murali

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 26, 2024 | 8:54 PM

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తొలి అడుగులు వేసే నాటికి అమెరికా, రష్యా లాంటి దేశాలు ఎన్నో అద్భుతాలను సొంతం చేసుకున్నాయి.. ఆలస్యంగా అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత్ కు చెందిన ఇస్రో తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలు అబ్బురపోయే అద్భుతాలను సాధించి సత్తా చాటింది.. ఇప్పటికే చంద్రుడిపై వరుస ప్రయోగాలు చేపట్టిన ఇస్రో నాసా లాంటి సంస్థకు కూడా సాధ్యం కానీ విషయాలను ప్రపంచానికి తెలియజేసింది. మాన్ మిషన్ కు సిద్ధమవుతున్న ఇస్రో ఆ తర్వాత శుక్రయాన్ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్రం ఆమోదం గుర్తు చేసుకున్న ఇస్రో అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా మొదలు పెట్టింది.

చంద్రయాన్ సిరీస్‌లో మూడు ప్రయోగాలను పూర్తి చేసుకున్న అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు తొలి మాన్ మిషన్ కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసుకుంది. చంద్రయన తర్వాత సూర్యుడిపై ప్రయోగం కోసం ఆదిత్యాయాన్ ను ఇప్పటికే ప్రయోగించింది.. అంగారక గ్రహంపై కూడా ప్రయోగం చేపట్టి కీలక విషయాలను ప్రపంచానికి తెలియజేసిన ఈశ్వరులు ఇప్పుడు శుక్ర గ్రహంపై పరిశోధనల కోసం శ్రీకారం చుట్టింది. శుక్రుడిపై ప్రయోగం కోసం శుక్ర మిషన్ ప్రాజెక్టు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇటీవలే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్రో చేపట్టనున్న శుక్రయాన్ ప్రయోగం కోసం అవసరమైన బడ్జెట్‌ను ఆమోదించినట్లు తెలిపింది. బడ్జెట్ తో పాటు మిగిలిన అన్ని అనుమతులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రయోగానికి లైన్ క్లియర్ అయింది. ఇస్రో డైరెక్టర్ నీలేష్ దేశాయ్ ఇస్రో చేపట్టనున్న శుక్రయాన్ ప్రయోగానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. 2028లో ప్రయోగం జరగనున్నట్లు తెలిపారు. చంద్రుడిపై ప్రయోగాల కోసం సిరీస్ ప్రయోగాలు జరిగినట్టే సెక్యూరిటీ పై ప్రయోగాల కోసం కూడా దశలవారిగా ప్రయోగాలు చేపట్టే దిశగా ఇస్రో ముందుకు వెళుతోంది. 2028లో శుక్రయాన్ మిషన్ చేపట్టనున్న ఇస్రో ఆ తర్వాత కూడా వరుస ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉంది.

శుక్రయాన్ అంటే..

శుక్రయాన్ అనేది సంస్కృత పదం నుంచి ప్రేరణతో నామకరణం చేసినట్లు ఇస్రో తెలిపింది. శుక్ర అనే పదం శుక్ర గ్రహానికి సంబంధించింది. కాగా యాన అంటే సంస్కృతంలో క్రాఫ్ట్ లేదా వాహకనౌక అని అర్థం వస్తుంది. అందుకనే శుక్ర యాన్ అనే నామకరణం చేశారు. సెక్యూరిటీపై ప్రయోగం కోసం ఇస్రో చేపట్టనున్న తొలి ప్రయోగం ఇది. శుక్ర గ్రహం ఉపరితలం పై ఉండే వాతావరణంలో దట్టమైన కార్బన్ డయాక్సైడ్, అగ్నిపర్వతాల్లో నిత్యం ఉండే రసాయనక చర్యలు ఇక్కడ అధికంగా ఉంటాయి.. భూమిని పోలిన ఉపగ్రహంగా చెప్పబడే శుక్రుడు పై ఉపరితల అన్వేషణ అక్కడి లక్షణాలను గుర్తించడం అలాగే భౌగోళిక ప్రక్రియలను పరిశీలించడం కోసం ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది.

శుక్రుడి ఉపరితలంపై ఉన్న వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకమైన పరికరాన్ని ఇస్రో తయారు చేస్తుంది. అధునాతన పరికరాలను ఒక ద్వారా ఇస్రో అక్కడికి పంపి శుక్రుడు పై ఉన్న వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు సన్నాహాలు మొదలు పెట్టనుంది.

వీడియో చూడండి..

శుక్రుడిపై ప్రయోగం కోసం ఇస్రో అంతర్జాతీయ సహకారం కూడా తీసుకోనుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తోపాటు గ్లోబల్ స్పేస్ ఏజెన్సీల భాగస్వామ్యంతో మిషన్ డెవలప్మెంట్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రయోగం పూర్తయితే భారత దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇది ఒక మైలు రాయిగా నిలవడం ఖాయం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..