చైనీస్ డీప్‌సీక్‌‌ బ్యాన్.. ఏయే దేశాల్లో..?

చైనీస్ డీప్‌సీక్‌‌ బ్యాన్.. ఏయే దేశాల్లో..?

image

TV9 Telugu

15 February 2025

చైనా కృత్రిమ మేధస్సు స్టార్టప్‌లు భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం విశ్వసిస్తోంది.

చైనా కృత్రిమ మేధస్సు స్టార్టప్‌లు భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం విశ్వసిస్తోంది.

దీనిని ప్రభుత్వ సాంకేతికతకు ఆమోదయోగ్యం కానిదని, ప్రమాదకరంగా భావిస్తున్న ఆస్ట్రేలియా. ప్రైవేట్ పౌర పరికరాలపై ఈ నిషేధాన్ని విధించలేదు.

దీనిని ప్రభుత్వ సాంకేతికతకు ఆమోదయోగ్యం కానిదని, ప్రమాదకరంగా భావిస్తున్న ఆస్ట్రేలియా. ప్రైవేట్ పౌర పరికరాలపై ఈ నిషేధాన్ని విధించలేదు.

భద్రతా కారణాల దృష్ట్యా ఆస్ట్రేలియా రెండేళ్ల క్రితమే ప్రభుత్వ పరికరాల్లో చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించింది.

భద్రతా కారణాల దృష్ట్యా ఆస్ట్రేలియా రెండేళ్ల క్రితమే ప్రభుత్వ పరికరాల్లో చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించింది.

100కి పైగా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు తమ పని ప్రదేశాలలో డీప్‌సీక్‌ను నిషేధిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో పాటు, ఇటలీ కూడా తన ఆపిల్ స్టోర్ నుంచి చైనీస్ డీప్‌సీక్‌ను తొలగించింది.

డీప్‌సీక్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన తర్వాత, ఇప్పుడు అన్ని దేశాలు దానిపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

క్రమంగా అనేక దేశాల ప్రభుత్వాలు దీనిని నిషేధించడం ప్రారంభించాయి. డీప్‌సీక్ అనేది తక్కువ సమయంలోనే తొందరపడి ప్రారంభించిన మోడల్‌గా కనిపిస్తోందంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్.

దీనిలో గోప్యతా గార్డు, డేటా నిర్వహణ సాధనాల లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు టెక్నాలజీ నిపుణులు.

డీప్‌సీక్ సమాధానాల ఆధారంగా మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్. చైనీస్ కంపెనీ ప్రస్తుతం డీప్‌సీక్‌పై మరింత పని చేయాల్సిన అవసరం ఉన్నట్లు అనిపిస్తోంది.