
మన జీవితంలో స్మార్ట్ ఫోన్ ఓ అత్యవసరం. అది లేకుండా అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి బెడ్ పై కూడా ఫోన్ చేతిలో ఆడుతుండాల్సిందే. అంతలా దానిపై ఆధారపడుతున్న సమయంలో అది సక్రమంగా పనిచేయకపోతే చాలా చిరాకుగా అనిపిస్తుంటుంది. సాధారణంగా ఫోన్లలో స్టోరేజ్ అయిపోయినా.. యాప్ లు ఎక్కువగా ఉన్నా ఫోన్ స్లో అయిపోతుంది. ఆ సమయంలో రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని, యువర్ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని నోటిఫికేషన్లు తరచూ చూస్తుంటాం. ఆసమయంలో ఫోన్ పనితీరు సక్రమంగా ఉండదు. అలాగే కొత్త ఫైళ్లు, ఫొటోలు, వీడియోలు, ఇతర వేరే యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవడం కుదరదు. అలాంటి సమయంలో ఏం చేయాలి? మళ్లీ స్పీడ్ అందుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. మీ ఫోన్ మళ్లీ ఫుల్ స్పీడ్ ను అందుకుంటుంది.
సాధారణంగా ఐదు రకాల యాప్స్ ఎక్కువ స్టోరేజ్ ను తీసుకుంటాయి. ఆడియో యాప్స్, ఓటీటీ యాప్స్, సోషల్ మీడియా యాప్స్, గేమింగ్ యాప్స్, ఫొటో/వీడియో యాప్స్.ఇవే సాధారణంగా ఎక్కువ ఫోన్ స్టోరేజ్ ని వాడుకుంటాయి. అయితే వీటిల్లో ఏ యాప్ వల్ల మీ ఫోన్ స్లో అవుతుంది? అధికంగా స్టోరేజ్ వాడుకుంటున్న యాప్ ని కనిపెట్టడం ఎలా? చూద్దాం రండి..
మీ ఆండ్రాయిడ్, ఐ ఫోన్ లోని సెట్టింగ్స్ మీకు ఈ విషయాన్ని వెల్లడిచేస్తుంది. సెట్టింగ్స్ లోని స్టోరేజ్ ఆప్షన్లో మీకు ఇది తెలిసిపోతుంది.
ఐఫోన్లో ఇలా..
ఆండ్రాయిడ్ ఫోన్ అయితే..
అలా అధిక స్టోరేజ్ వినియోగిస్తున్న యాప్ లను గుర్తించిన తర్వాత అవి మీరు అంతగా వినియోగించనివి అయితే వెంటనే డిలీట్ చేసేసుకోవాలి. దాని వల్ల మీ ఫోన్ స్టోరేజ్ ఆదా అవడంతో పాటు ఫోన్ స్పీడ్ కూడా పెరుగుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..