iPhone 13: విడుదలకు ముందే లీకైన ఐఫోన్ 13 స్టోరేజ్ వేరియంట్‌లు, కలర్స్.. వచ్చేవారం విడుదల కానున్న ఆపిల్ కొత్త ఫోన్లు
ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ ఫోన్లు రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో, ఐఫోన్ 13 ప్రో మోడల్స్‌లో మూడు వెర్షన్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

iPhone 13 Pro: ఐఫోన్ 13 వచ్చే వారం జరిగే ఆపిల్ ఈవెంట్‌లో విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే ఐఫోన్ 13 సిరీస్‌లోని ఫోన్ల స్టోరేజ్, కలర్ ఆప్షన్‌లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఉక్రేనియన్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీల వివరాలు పొందుపరిచారు. అలాగే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ని కూడా ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. కొత్త మోడల్ ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఐఫోన్ 14 సిరీస్‌లను ఆపిల్ 2022 లో విడుదల చేయనుందని తెలుస్తోంది. ఐఫోన్ 13 మోడల్స్ లాంచ్ అయిన సంవత్సరం తరువాత ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఐఫోన్ 14 ప్రో మాక్స్, ఐఫోన్ 14 ప్రోతో ఈ సిరీస్‌లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ ఫోన్లు అండర్-డిస్‌ప్లే ఫేస్ ఐడి టెక్నాలజీతో వస్తాయని తెలుస్తోంది.
ఉక్రేనియన్ ఇ-కామర్స్ సైట్ కేటీసీ ఐఫోన్ 13 సిరీస్ స్టోరేజ్ వేరియంట్‌లు, కలర్ ఆప్షన్‌లను సైట్‌లో ఉంచింది. ఇది మొదట్లో 91 మొబైల్స్ గుర్తించినట్లు పేర్కొంది.
ఐఫోన్ 13 స్టోరేజ్ వేరియంట్‌లు, కలర్ ఆప్షన్‌లు (అంచనా) కేటీసీ సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఐఫోన్ 13 (iPhone 13), ఐఫోన్ 13 మినీ (iPhone 13 Mini) 64 జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 12 256జీబీ మోడల్ రూ. 78,950, ఐఫోన్ 12 మినీ రూ. 69,900 రెండింటిలోనూ టాప్-ఎండ్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది. అయితే ఐఫోన్ 13 ప్రో (iPhone 13 Pro), ఐఫోన్ 13 ప్రో మాక్స్( iPhone 13 Pro Max) 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆఫ్షన్‌లలో లభించనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ కోసం 1 టీబీ స్టోరేజ్ మోడల్ ఉండవచ్చని రూమర్ మిల్ సూచించింది.
ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ బ్లాక్, బ్లూ, పింక్, పర్పుల్, ప్రొడక్ట్ (రెడ్), వైట్ కలర్స్‌లో లభించనున్నాయి. పింక్ కలర్ మోడల్ ఈసారి కొత్తగా ఉండవచ్చు అని తెలుస్తోంది. అయితే ఇతర కలర్ వేరియంట్‌లు గత సంవత్సరం ఐఫోన్ 12 మోడళ్లకు సమానంగా ఉండనున్నాయి.
ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ ఇతర వైపున, బ్లాక్, సిల్వర్, గోల్డ్, కాంస్యం రంగులలో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇవి ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్‌లో లభించే గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ షేడ్స్‌కి భిన్నంగా ఉంటాయని పేర్కొంది.
ఆపిల్ తన తదుపరి ఈవెంట్‌ను సెప్టెంబర్ 14 న హోస్ట్ చేయనుంది. ఈ ఈవెంట్‌లోనే ఐఫోన్ 13 సిరీస్ గురించి అధికారిక వివరాలను ప్రకటించనుంది.
Also Read: Asteroids: భూమికి అతి దగ్గరగా వచ్చిన 1000వ గ్రహశకలాన్ని గుర్తించిన నాసా..
Cough: మీరు ఒక్కసారి దగ్గితే చాలు మీకున్న వ్యాధి ఏమిటో ఈ యాప్ చెబుతుంది..ఎలాగంటే..