Instagram: ఇన్‌స్టాగ్రామ్ Vs ఇన్‌స్టాగ్రామ్ లైట్.. రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా..?

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఎంతో మంది పడిసచ్చిపోతారు. గంటలపాటు రీల్స్‌లో మునిగిపోతారు. యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ ఇస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటుగా ఇన్‌స్టాగ్రామ్ లైట్ అనే యాప్ కూడా ఉంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటీ..? ఏది వాడడం బెస్ట్..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Instagram: ఇన్‌స్టాగ్రామ్ Vs ఇన్‌స్టాగ్రామ్ లైట్.. రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా..?
Instagram Vs Instagram Lite

Updated on: Nov 03, 2025 | 11:28 PM

ప్రస్తుత కాలంలో ఇన్‌స్టాగ్రామ్ వాడకం బాగా పెరిగింది. యువత రీల్స్‌లో మునిగిపోతున్నారు. గంటల తరబడి రీల్స్ చూస్తున్నారు. దీన్ని ద్వారా ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు. ఇన్‌స్టా రీల్స్‌తో ఫేమస్ అయినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇన్‌స్టా కూడా యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తీసుకొస్తుంది.  ఇన్‌స్టాగ్రామ్‌తో పాటుగా  ఇన్‌స్టాగ్రామ్ లైట్ అనే ఇంకో యాప్ కూడా ఉంది. ఈ రెండింటికీ ఉన్న తేడాలు ఇక్కడ తెలుసుకుందాం.

సైజ్‌లో పెద్ద తేడా

ఇన్‌స్టాగ్రామ్ యాప్, ఇన్‌స్టాగ్రామ్ లైట్ మధ్య అతిపెద్ద తేడా వాటి సైజ్. ఇన్‌స్టాగ్రామ్ ప్రధాన యాప్ పరిమాణం చాలా పెద్దది. అందుకే అది ఎక్కువ ఇంటర్నెట్ డేటాను, ఎక్కువ ఫోన్ మెమరీని వాడుకుంటుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్ లైట్ అనేది చాలా చిన్న యాప్. తక్కువ డేటాతో, నెమ్మదైన ఇంటర్నెట్‌లో కూడా ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుకోవడానికి మెటా సంస్థ దీన్ని తీసుకొచ్చింది.

ఎవరికి ఉపయోగం?

ఇన్‌స్టాగ్రామ్ లైట్ ముఖ్యంగా నెమ్మదిగా ఇంటర్నెట్ ఉన్నవారికి లేదా ఫోన్‌లో తక్కువ మెమరీ ఉన్నవారికి చాలా మంచిది. ఇది దాదాపు 170 దేశాలలో అందుబాటులో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లైట్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆపిల్ వినియోగదారులకు విడుదల కాలేదు.

లైట్ యాప్‌లో ఏముంటాయి..?

లైట్ యాప్‌లో కూడా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయవచ్చు. స్టోరీస్ చూడవచ్చు. కానీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వంటి కొన్ని ఆప్షన్లు ఇందులో ఉండవు. ఇన్‌స్టాగ్రామ్ లైట్ యాప్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఫోన్లలో ఇది లేదు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి