ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై రైల్వే స్టేషన్‌లో ఉచిత హైస్పీడ్‌ ఇంటర్నెట్‌.. ఎలా పొందాలంటే!

దేశంలోని రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. డిజిటల్‌ ఇండియా పేరుతో రైల్వే స్టేషన్‌లలో ఇప్పటికే ఉచిత వై ఫైను అందిస్తున్న భారత ప్రభుత్వం.. ఇకపై దాన్ని మరింత వేగవంతం చేయనుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్‌లలో హైస్పీడ్‌ ఉచిత వైఫై సైకర్యాన్ని కల్పించనుంది.

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై రైల్వే స్టేషన్‌లో ఉచిత హైస్పీడ్‌ ఇంటర్నెట్‌.. ఎలా పొందాలంటే!
Free Wifi

Updated on: Aug 11, 2025 | 5:41 PM

దేశంలోని రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. డిజిటల్‌ ఇండియా పేరుతో రైల్వే స్టేషన్‌లలో ఇప్పటికే ఉచిత వై ఫైను అందిస్తున్న భారత ప్రభుత్వం.. ఇకపై దాన్ని మరింత వేగవంతం చేయనుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్‌లలో హైస్పీడ్‌ ఉచిత వైఫై సైకర్యాన్ని కల్పించనుంది. రైల్వే సౌకర్యాలపై రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తే కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రైల్వే మంత్రి ప్రాకరం.. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6,115 రైల్వే స్టేషన్లలో అత్యంత వేగవంతమైన హైస్పీడ్‌ వై-ఫై ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.

రైల్వే స్టేషన్‌లో ఉండే ఉచిత వై-ఫైను కనెక్ట్‌ చేసుకొని హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ను ప్రయాణికులు పొందవచ్చు. ఈ వైఫైను వాడుకొని ప్రయాణికులు తమకు అవసరమైన అన్ని సినిమాలు, గేమ్స్‌, సాంగ్స్‌ వంటివి డౌన్‌లోడ్ చేసుకొవచ్చు. ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. అంతేకాకుండా ఈ వైఫై ద్వారా మన ఆఫీస్‌ పనులు కూడా చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఈ వైఫైను ఎలా యూజ్‌ చేసుకోవాలో తెలియదు. రైల్వే స్టేషన్‌లో వైఫైను ఎలా కనెక్ట్‌ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fiని ఎలా కనెక్ట్‌ చేసుకోవాలి?

  • మొదటగా మీ స్మార్ట్‌ఫోన్‌లలోని వైఫై మోడ్‌ను ఆన్‌ చేయండి
  • వైఫై ఆప్షన్‌ మీద క్లిక్‌ చేస్తే అక్కడ మీకు RailWire Wi-Fi నెట్‌వర్క్‌ను అని కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోండి
  • దాన్ని క్లిక్ చేసిన తర్వాత అది మీ నెంబర్‌తో రిజిస్టర్‌ అవ్వమని చెబుతోంది. అక్కడ మీ ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి
  • తర్వాత మీ ఫోన్‌ నెంబర్‌కు ఒక SMS ద్వారా ఒక OTP వస్తుంది
  • మీకు వచ్చిన 6 డిజిట్స్‌ OTP నెంబర్‌ను అక్కడ ఎంటర్‌ చేయండి. వెంటనే మీకు Wi-Fi కనెక్ట్‌ అవుతుంది. అప్పుడు మీరు హై
  • స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ను ఉపయోగించుకోవచ్చు

మరిన్ని సైన్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.