IIT: ఐఐటీ పరిశోధకుల వినూత్న సృష్టి.. అందుబాటులోకి సరికొత్త విద్యుత్ ఉత్పత్తి టెక్నాలజీ..
సముద్రాల వద్ద అలల ఆటుపోట్లులతో పాటు గాలి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే టెక్నాలజీ పరిశోధకులు రూపొందించారు. ఇలా రెండు వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. తీరప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసే ఎనర్జీ కన్వర్టర్ వ్యవస్థతో పాటు తీర ప్రాంతంలోని విద్యుత్ అవసరాలను బట్టి ఉత్పత్తితో పాటు నిల్వ చేసే విధంగా మొబైల్ వాహనాలు ఉంటాయి...

విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఐఐటీ మద్రాస్ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. సముద్రాల వద్ద అలల ఆటుపోట్లులతో పాటు గాలి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే టెక్నాలజీ పరిశోధకులు రూపొందించారు. ఇలా రెండు వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. తీరప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసే ఎనర్జీ కన్వర్టర్ వ్యవస్థతో పాటు తీర ప్రాంతంలోని విద్యుత్ అవసరాలను బట్టి ఉత్పత్తితో పాటు నిల్వ చేసే విధంగా మొబైల్ వాహనాలు ఉంటాయి.
ఈ వాహనం పైకప్పుపై అమర్చే విండ్ టర్బైన్ గాలి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక టైడల్ శక్తిని (సముద్రపు అలలు) విద్యుత్ శక్తిగా మార్చడానికి కన్వర్టర్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రూఫ్ మౌంటెడ్ సోలార్ ప్యానెల్ మొబైల్ వాహనాలపై ఇతర పరికరాలకు శక్తినివ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయమై ఐఐటీ మద్రాస్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ సాధమ్ ఉసేర్ రామసామి మాట్లాడుతూ.. ‘ఈ కొత్త టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు. స్థిరమైన శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. దీనిని మొబైల్ వాహనంగా కూడా ఉపయోగించుకోవచ్చు. పవర్ సెక్టార్, సోలార్, విండ్ ఎనర్జీకి చెందిన కంపెనీలు ఈ టెక్నాలజీలో భాగస్వాములు కానున్నాయి’ అని చెప్పుకొచ్చారు.
ఐఐటీ పాలక్కాడ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ. శేషాద్రి శేఖర్ మాట్లాడుతూ.. ఈ కొత్త ఆవిష్కరణలో వర్టికల్ (నిలువు) యాక్సిస్‌లో ఉండే విండ్ టర్బైన్‌ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుంది. ఇక హారిజంటల్ (అడ్డు) కన్వర్టర్ మెకానిజం, హైడ్రాలిక్ సెట్ జనరేటర్‌ను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఇక కన్వర్టర్ అనేది రిమోట్ నియంత్రిత వ్యవస్థ అని ఇది సముద్రపు అలలు, విద్యుత్ ఉత్పత్తి అవసరాల ఆధారంగా ఏదైనా స్థానానికి మార్చుకోవడని ఉపయోగపడుతుంది. 5 గేర్లతో కూడిన కన్వర్టర్లు కనీసం ఒక జనరేటర్‌ను ఆపరేట్ చేయడంలో సహాయపడతాయని, డబులు డెక్కర్ వాహనంపై పైకప్పుపై కనీసం ఒక నిలువు విండ్ టర్బైన్‌ను అమర్చడంలో ఉపయోగపడతాయని ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం మాజీ హెడ్ శేఖర్ తెలిపారు.
ఇక మొబైల్ వాహనం విషయానికొస్తే.. ఇందులో చైన్‌లతో కూడిన వీల్స్ ఉంటాయి. దీంతో ఈ డబుల్ డెక్కర్ మొబైల్ వాహనాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి సులభంగా తరలించవచ్చు. ఇక వాహనం ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సులభంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ తక్కువ ఖర్చు, తక్కువ నిర్వహణతో పాటు స్వచ్ఛమైన విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని శేఖర్ చెప్పుకొచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..