Washing Machine: వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం ఉపయోగించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Washing Machine: ఒకప్పుడు చాలా మంది చేతులతో బట్టలు ఉతికేవారు. కానీ ప్రస్తుతం వాషింగ్ మెషీన్ సాయంతో ఈ పని చాలా సులభం అయ్యింది. సమయం ఆదా అవుతోంది.
Washing Machine: ఒకప్పుడు చాలా మంది చేతులతో బట్టలు ఉతికేవారు. కానీ ప్రస్తుతం వాషింగ్ మెషీన్ సాయంతో ఈ పని చాలా సులభం అయ్యింది. సమయం ఆదా అవుతోంది. చాలామంది ఈ సమయాన్ని ఇతర పనులకి కేటాయిస్తు్న్నారు. కానీ ఇప్పటికీ కొంతమంది చేతులతోనే బట్టలు ఉతుకుతున్నారు. అయితే వాషింగ్ మెషీన్ చాలా మంది ప్రజల జీవితాన్ని సులభతరం చేసింది. విశేషమేమిటంటే ఇప్పుడు మార్కెట్‌లో ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో బట్టలు వేసిన తర్వాత మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. బట్టలు ఉతకడం, ఆరబెట్టడం అదే చేస్తుంది. అయితే వాషింగ్ మెషిన్ చాలాకాలం ఉపయోగించాలంటే దానిని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. కొన్ని చిట్కాలని అనుసరించడం ద్వారా మీరు యంత్రాన్ని చాలా కాలం పాటు కాపాడుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
సామర్థ్యం ప్రకారం బట్టలు వేయాలి
మార్కెట్లో మీరు 6, 7, 8 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాషింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. వాషింగ్ మెషీన్ చాలాకాలం కొనసాగాలంటే దాని సామర్థ్యం ప్రకారం అందులో బట్టలు వేయాలి. చాలా సార్లు ప్రజలు త్వరగా ఉతకడానికి, నీటిని ఆదా చేయడానికి మిషన్‌లో బట్టలు ఎక్కువగా వేస్తారు. ఇది దాని జీవితాన్ని తగ్గించడానికి ముఖ్యమైన కారణం అవుతుంది. యంత్రంపై లోడ్ కారణంగా దాని పని సామర్థ్యం తగ్గిపోతుంది.
సరైన డిటర్జెంట్
వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు చాలా మంది డిటర్జెంట్‌ను ఉపయోగిస్తారు. అయితే సరైన డిటర్జెంట్ వాడటం ముఖ్యం. ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లకి లిక్విడ్ డిటర్జెంట్లు మాత్రమే వాడాలి. వాస్తవానికి డిటర్జెంట్ వాషింగ్ మెషీన్ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల సరైన డిటర్జెంట్ ఎంచుకోవడం ముఖ్యం.
వారానికి ఒకసారి క్లీనింగ్
మెషీన్ మంచి పనితీరు కోసం వారానికి ఒకసారి దానిని డ్రైగా ఉంచాలి. దాని సామర్థ్యం మెరుగవుతుంది. అంతేకాదు వాషింగ్ మెషీన్ శుభ్రం చేయాలంటే మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం యంత్రం ఎక్కువసేపు పనిచేయడానికి దాని మెయింటనెన్స్ కూడా ముఖ్యమే. యంత్రాన్ని శుభ్రం చేయకపోతే అది త్వరగా చెడిపోతుంది.