Twitter: ట్వీట్ లో మీ పేరు మెన్షన్ చేశారా.. ఇబ్బంది పడాల్సిన పని లేదు.. ఈ అద్భుతమైన ఫీచర్ మీ కోసమే
ట్విట్టర్(Twitter) వినియోగదారులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విట్టర్ లో రోజూ భారీ సంఖ్యలో సందేశాలు పోస్ట్ అవుతాయి. అయితే...
ట్విట్టర్(Twitter) వినియోగదారులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విట్టర్ లో రోజూ భారీ సంఖ్యలో సందేశాలు పోస్ట్ అవుతాయి. అయితే ట్విటర్‌లో ఎవరైనా సందేశాన్ని పోస్ట్(Post) చేసేటప్పుడు కొన్ని కొన్ని సార్లు మన పేరును మెన్షన్ చేయడం తెలిసిందే. ఇది మనకు అసౌకర్యంతో పాటు ఇబ్బందిని కలిగిస్తుంది. అనవసరంగా పేరు మెన్షన్ చేశారని బాధ పడాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా మీ పేరును మెన్షన్ చేసినా తొలగించేలా ట్విటర్ అద్భుతమైన ఫీచర్ తీసుకురానుంది. ‘అన్‌మెన్షన్’(Un Mention) పేరుతో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొంతమంది యూజర్లకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ట్విటర్‌లో ఏదైనా ట్వీట్‌కు సంబంధించి మీ పేరును మెన్షన్ చేస్తే సులువుగా తొలగించేలా ‘అన్‌మెన్షన్’ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని అధికారిక ‘ట్విటర్ సేఫ్టీ ప్రొఫైల్’ ఖాతాలో వెల్లడించింది. ఇక ట్వీట్‌లో ఎవరైనా యూజర్ల పేరును మెన్షన్ చేస్తే దాన్ని సులువుగా డిలీట్ చేసేలా ఈ ఫీచర్ పని చేయనుందని పేర్కొంది.
How do you say “Don’t @ me,” without saying “Don’t @ me”?
We’re experimenting with Unmentioning—a way to help you protect your peace and remove yourself from conversations—available on Web for some of you now. pic.twitter.com/rlo6lqp34H
— Twitter Safety (@TwitterSafety) April 7, 2022
Also Read
Health Tips: ధృడమైన ఎముకల కోసం పాలు మాత్రమే సరిపోవు.. ఈ ఆహారాలు కూడా ముఖ్యమే..!
Ram Charan: ఆ తమిళ హీరోలను మెగాపవర్ స్టార్ ఫాలో అవుతున్నాడా..? క్రిటిక్స్ ఏమంటున్నారంటే
Pawan Kalyan Fans: ఊరికే హీరోలైపోరు మరి.. పవర్ స్టార్ స్పెషల్ ట్రైనింగ్ పై ఫ్యాన్స్ ఏమంటున్నారంటే