- Telugu News Photo Gallery Science photos Viagra Effects Use of viagra may lead to blindness say study know the reason behind it
Viagra Effects: ‘వయాగ్రా’ ఎక్కువగా వాడుతున్నారా? భారీ నష్టం తప్పదు.. అదేంటో ఇప్పుడే తెలుసుకోండి..!
రెగ్యులర్ గా వయాగ్రా తీసుకునే వారిలో 80 శాతం వరకు కంటిచూపు కోల్పోవచ్చు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు తమ తాజా పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు. వయాగ్రా, సియాలిస్, లెవిట్రా, స్పాడ్రాలలో వినియోగించే కెమికల్స్ కళ్లకు సమస్యలను కలిగిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. వయాగ్రా వల్ల కళ్లకు ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి..
Updated on: Apr 11, 2022 | 6:58 AM

Viagra Effects: రెగ్యులర్ గా వయాగ్రా తీసుకునే వారిలో 80 శాతం వరకు కంటిచూపు కోల్పోవచ్చు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు తమ తాజా పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు. వయాగ్రా, సియాలిస్, లెవిట్రా, స్పాడ్రాలలో వినియోగించే కెమికల్స్ కళ్లకు సమస్యలను కలిగిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. వయాగ్రా వల్ల కళ్లకు ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి..

శృంగారంలో నూతనోత్సేజాన్ని తీసుకురావడానికి వయాగ్రా ఉపయోగిస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే, ఒక వ్యక్తి వయాగ్రాను తీసుకున్నప్పుడు వారి శరీరంలో రక్త ప్రసరణ వేగంగా పెరుగుతుంది. ఇది కళ్ళపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దాని ప్రభావం కారణంగా, ఆకస్మిక దృష్టి లోపం ఏర్పడుతుంది. కళ్ళలో నల్ల మచ్చలు ఏర్పడతాయి. అందువల్ల, వయాగ్రా వాడకం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. వయాగ్రా అనార్థాలను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు నాలుగేళ్లపాటు సుమారు 2 లక్షల మందిపై పరిశోధనలు చేశారు. దీన్ని రెగ్యులర్ గా వాడేవారిలో మాత్రమే కళ్లకు సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది. వీటిలో రెటీనాకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

పరిశోధనలో పాల్గొన్న పురుషుల్లో ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి ప్రమాదం 102% పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. ఈ పరిస్థితిలో కళ్ళలోని సిరల్లో రక్త సరఫరా అసాధారణంగా మారుతుంది. కంటి చూపు పోతుంది. అదే సమయంలో, 44 శాతం మంది పురుషులకు రెటీనాలో రక్తం గడ్డకట్టే సమస్య ఉండవచ్చని తేల్చారు.

వయాగ్రా తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు తెలియజేశారు. ఇక వయాగ్రాను తయారుచేసే సంస్థ ఫైజర్ సైతం.. దీనిని తీసుకునే ప్రతి 100 మందిలో ఒకరు కళ్ల మంట, కళ్లలో ఎరుపు, నొప్పి, నీళ్ళు కారుతున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారని కూడా తెలిపింది. కాబట్టి ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకోవడం ఉత్తమం.




