Huawei Watch GT4: 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో నయా వాచ్ రిలీజ్ చేసిన హువాయ్.. ధర తెలిస్తే షాక్

|

Aug 16, 2024 | 4:45 PM

ఇటీవల కాలంలో యువత స్మార్ట్ యాక్ససరీస్‌ను వినియోగించడాన్ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. సాధారణంగా భారతదేశ జనాభాకు తగ్గట్టే స్మార్ట్ వాచ్‌లు వాడే వారి సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ హువాయ్ వాచ్ జీటీ4 పేరతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను భారతదేశంలో రిలీజ్ చేసింది.

Huawei Watch GT4: 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో నయా వాచ్ రిలీజ్ చేసిన హువాయ్.. ధర తెలిస్తే షాక్
Huawei Watch Gt4
Follow us on

ఇటీవల కాలంలో యువత స్మార్ట్ యాక్ససరీస్‌ను వినియోగించడాన్ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. సాధారణంగా భారతదేశ జనాభాకు తగ్గట్టే స్మార్ట్ వాచ్‌లు వాడే వారి సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ హువాయ్ వాచ్ జీటీ4 పేరతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను భారతదేశంలో రిలీజ్ చేసింది. ముఖ్యంగా 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఇచ్చేలా ఈ స్మార్ట్ వాచ్‌ను రూపొందించారు. అక్టాగోనల్ డిజైన్‌లో లాంచ్ చేసిన ఈ వాచ్ కచ్చితంగా యువతను ఆకట్టుకుంటుందని హువాయ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లు రెండింటికీ ఈ వాచ్‌ను కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో హువాయ్ జీటీ-4 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

హువాయ్ జీటీ-4 వాచ్‌ను రూ. 14,999 ధరతో లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ వాచ్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వా ఈ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే మొదటి 100 మంది కొనుగోలుదారులకు కంపెనీ 500 రూపాయల తగ్గింపును కూడా అందిస్తోంది. హువాయ్ వాచ్ జీటీ-4 466×466 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.43 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. బ్లూమింగ్ వాచ్ ఫేస్ వంటి డైనమిక్ ఆప్షన్లతో సహా కస్టమ్ వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. హువాయ్ వాచ్ జీటీ-4 స్టెయిన్లెస్ స్టీల్ కేసింగ్‌తో అందుబాటులో ఉంటుంది. సైడ్ బటన్‌తో పాటు రోటేటబుల్ క్రౌన్ ఆకట్టుకుంటుంది.

హువాయ్ వాచ్ జీటీ-4  స్మార్ట్ వాచ్‌లో యాక్సిలెరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, మాగ్నెటోమీటర్ సెన్సార్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బారోమీటర్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ వంటి బహుళ సెన్సార్లు ఉంటాయి. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ వస్తుంది. అలాగే అంతర్నిర్మిత మైక్రోఫోన్, స్పీకర్‌తో వచ్చే వాచ్ 4 జీబీ + 32 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ ట్రూసీన్ 5.5 ప్లస్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇది హృదయ స్పందన రేటును విశ్లేషించడంతో పాటు అరిథ్మియా ప్రమాదాలను గుర్తిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మీ ఎస్‌పీఓ-2 స్థాయి, నిద్రను కూడా ట్రాక్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..