HP Laptops: హెచ్‌పీ నుంచి సరికొత్త నోట్ బుక్ ల్యాప్ టాప్స్.. అధిక పనితీరు.. అత్యాధునిక ఫీచర్లు.. పూర్తి వివరాలు..

కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లలో ఈ బ్రాండ్ కు తిరుగులేదు. ఇప్పుడు సరికొత్తగా నోట్‌బుక్స్ ల్యాప్ టాప్ పోర్ట్‌ఫోలియోను హెచ్‌పీ ప్రారంభిస్తోంది. పెవిలియన్ ప్లస్ నోట్‌బుక్స్‌ని ఇండియాలలో లాంచ్ చేసింది. హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14, 16 ల్యాప్ టాప్‌ల పేరిట మన దేశీయ మార్కెట్లోకి వచ్చిన ఈ ల్యాప్ టాప్ లలో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్, ఏఎండీ రైజెన్ 7 సిరీస్ ప్రాసెసర్స్ ఉన్నాయి.

HP Laptops: హెచ్‌పీ నుంచి సరికొత్త నోట్ బుక్ ల్యాప్ టాప్స్.. అధిక పనితీరు.. అత్యాధునిక ఫీచర్లు.. పూర్తి వివరాలు..
Hp Pavilion Plus 14 And 16 Laptops

Edited By: Ram Naramaneni

Updated on: Oct 19, 2023 | 10:17 PM

టెక్ దిగ్గజం హెచ్‌పీకి నుంచి గ్యాడ్జెట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లలో ఈ బ్రాండ్ కు తిరుగులేదు. ఇప్పుడు సరికొత్తగా నోట్‌బుక్స్ ల్యాప్ టాప్ పోర్ట్‌ఫోలియోను హెచ్‌పీ ప్రారంభిస్తోంది. పెవిలియన్ ప్లస్ నోట్‌బుక్స్‌ని ఇండియాలలో లాంచ్ చేసింది. హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14, 16 ల్యాప్ టాప్‌ల పేరిట మన దేశీయ మార్కెట్లోకి వచ్చిన ఈ ల్యాప్ టాప్ లలో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్, ఏఎండీ రైజెన్ 7 సిరీస్ ప్రాసెసర్స్ ఉన్నాయి. అంతేకాక దీనిలో ఎన్విడియా ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్స్ ఉంటుంది. ఈ హెచ్‌పీ ల్యాప్ టాప్ లు ఐమ్యాక్స్ ఎన్ హ్యాన్స్‌డ్ డిస్ ప్లే ఉంటుంది. దీని సాయంతో అత్యాధిక నాణ్యత కలిగిన విజువల్స్, ఆడియో, ప్రీమియం డిజిటల్ క కంటెంట్ ను వీక్షించవచ్చు.

హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ ల్యాప్ టాప్స్: ధర, లభ్యత

హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 ల్యాప్ టాప్ వార్న్ గోల్డ్ నేచురల్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. దీని ధర రూ. 1,24,999గా ఉంది. అలాగే హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14 ల్యాప్ టాప్ మూన్ లైట్ బ్లూ, నేచురల్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. దీని ధర రూ. 91,999గా ఉంది.

హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 స్పెసిఫికేషన్స్..

హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 ల్యాప్ టాప్ లో 16 అంగుళాల 2.5కే డబ్ల్యూక్యూఎక్స్‌‌జీఏ డిస్ ప్లే ఇంటెల్ ఎవో సర్టిఫైడ్ డిజైన్ తో ఉంటుంది. దీనలో 13వ జనరేషనన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఉంటుంది. 90శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. 16:10 ఆస్పక్ట్ రేషియో ఉంటుంది. ఎన్వీడియా ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్స్ 120హెర్జ్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ల్యాప్ టాప్ లో ఐమ్యాక్స్ ఎన్ హ్యాన్స్ డ్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో 68 వాట్ అవర్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. వైఫై 6ఈతో వేగవంతమైన కనెక్టివిటీ ఉంటుంది. దీనిలో 5ఎంపీ ఐఆర్ కెమెరా ఉంటుంది. అంతేకాక దీనిలో మాన్యువల్ కెమెరా షట్టర్ అందుబాటులో ఉంటుంది. ఇది మీ ప్రైవసీని కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14 స్పెసిఫికేషన్స్..

ఈ ల్యాప్ టాప్ లో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఉంటుంది. ఏఎండీ రైజన్ 7 7840హెచ్ ప్రాసెసర్ ఉంటుంది. 88శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. 16:10 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. ఇదిచాలా లైట్ వెయిట్లో ఉంటుంది. సులభంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. దీనిలో 13 గంటల పాటు వీడియ ప్లే బ్యాక్ ను అందించే బ్యాటరీ ఉంటుంది. ఐమ్యాక్స్ ఎన్ హ్యన్స్డ్ డిస్ ప్లే 2.8కే ఓఎల్ఈడీకి సపోర్టు చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..