
పీసీకి వైరస్ సోకినప్పుడు పనితీరులో కొన్ని మార్పులొస్తాయి. అయితే చాలామంది వీటిని తేలిగ్గా తీసుకుంటారు. సిస్టమ్ స్లో అయిందేమో అనుకుని వదిలేస్తారు. అయితే మాల్వేర్ ఎటాక్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో ల్యాప్‌టాప్‌పై ప్రొఫెషల్ వర్క్ చేసుకునే వాళ్లు జాగ్రత్తగా ఉండడం అవసరం.
కంప్యూటర్‌లో ఫోల్డర్స్ లేదా పాప్–అప్ విండోస్ మాటిమాటికీ క్రాష్ అవ్వడం లేదా ఆటోమేటిక్‌గా క్లోజ్ అవ్వడం గమనిస్తే.. వైరస్ సోకిందేమో చెక్ చేయాలి. ఇలా జరుగుతున్నప్పుడు వెంటనే టెక్నీషియన్ సాయం తీసుకోవాలి. లేదా యాంటీ వైరస్‌తో స్కాన్ చేయాలి. లేకపోతే హార్డ్ డిస్క్‌లో డేటా అంతా క్లియర్ అయిపోవచ్చు. అలాగే ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మాటిమాటికీ పాప్–అప్‌లు వస్తుంటే అది యాడ్‌వేర్ వైరస్ పని అవ్వొచ్చు. ఇలాంటప్పుడు వెంటనే ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ చేసి.. సిస్టమ్ షట్‌డౌన్ చేయాలి. లేటెస్ట్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో పీసీని స్కాన్ చేయాలి.
సిస్టమ్‌లోని ఇన్‌బిల్ట్ సాఫ్ట్‌వేర్స్‌ను ఓపెన్ చేసినప్పుడు యాక్సెస్ లేదని డిస్‌ప్లే వస్తుంటే అది వైరస్ పని కావొచ్చు. వైరస్‌లు సిస్టమ్ ఫైల్స్‌ను ఎటాక్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు వెంటనే సిస్టమ్‌లోని డేటాను రీస్టోర్ చేసి ఫార్మాట్ చేయడం బెటర్.
బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏవేవో వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతుంటే అది ఇంటర్నెట్ ద్వారా సిస్టమ్‌లోకి ఎంటర్ అయిన బగ్ కావొచ్చు. ఇలాంటప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ చేసి పీసీని యాంటీవైరస్‌తో స్కాన్ చేయాలి.
ఇక వీటితోపాటు పీసీ వేగం తగ్గడం, డేటా యూసేజ్ పెరగడం, స్క్రీన్ ఆటో ఆఫ్, ఆటో ఆన్ అవ్వడం లాంటివి కూడా వైరస్ వల్ల వచ్చే మార్పులే. ఇలాంటివి గమనించినప్పుడు వెంటనే యాంటీ వైరస్‌తో సిస్టమ్‌ను స్కాన్ చేయాలి. లేదా టెక్నీషియన్‌కు చూపించాలి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి