Honor Magic 6 Pro: హానర్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌.. వావ్‌ అనిపించే ఫీచర్స్‌

చైనాకు చెంది స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హానర్‌ మొన్నటి వరకు బడ్జెట్‌ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ మార్కెట్లో సందడి చేసింది. అయితే తాజాగా హానర్‌ ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. హానర్‌ మ్యాజిక్‌ 6 ప్రో పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్‌ చేసిన ఈ కొత్త ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు..

Honor Magic 6 Pro: హానర్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌.. వావ్‌ అనిపించే ఫీచర్స్‌
Honor Magic 6 Pro

Updated on: May 27, 2024 | 5:07 PM

చైనాకు చెంది స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హానర్‌ మొన్నటి వరకు బడ్జెట్‌ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ మార్కెట్లో సందడి చేసింది. అయితే తాజాగా హానర్‌ ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. హానర్‌ మ్యాజిక్‌ 6 ప్రో పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్‌ చేసిన ఈ కొత్త ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ హానర్‌ మ్యాజిక్‌ 6 ప్రోలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇదిలా ఉంటే ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు లీక్‌ అయ్యాయి. వీటి ఆధారంగా ఈ ఫోన్‌ క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్​ జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 5600 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇది ప్రీమియం ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందించింది. ఇక ధర విషయానికొస్తే హానర్‌ మ్యాజిక్‌ 6 ప్రో.. 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 1299గా యూరోలుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. లక్షకు పైమాటే.

ఇక ఈ ఫోన్‌లో 6.8 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ​ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ కెమెరా విషయానికొస్తే ఇందులో 180 మెగాపిక్సెల్స్‌తో కూడిన టెలీఫోటో లెన్స్‌తో పాటు 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన మరో రెండు కెమెరాలను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఫ్రంట్‌ కెమెరాతో 4కే వీడియోలను 30 ఎఫ్​పీఎస్ వద్ద, వెనుక కెమెరా 60 ఎఫ్​పీఎస్ వద్ద 4కే వీడియోలను రికార్డ్ చేయొచ్చు.

ఇక హానర్‌ మ్యాజిక్‌ 6 ప్రో ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8 పై పనిచేస్తుంది. ఈ పరికరంతో 4 సంవత్సరాల ఓఎస్ అప్​డేట్ లు. 5 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్​లను అందించనున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్స్‌పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..