AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Prepaid Plans: బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్సెస్‌ జియో, ఎయిర్‌టెల్‌, వీఐ.. ఏది బెస్ట్‌ అంటే..

మిగిలిన ప్రైవేటు ఆపరేటర్లతో పోల్చితే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్ల రేట్లు చాలా తక్కువగా ఉండటం కూడా ఇందుకు మరో కారణంగా ఉంది. ఈ క్రమంలో వాటి రేట్లు అసలు ఎలా ఉన్నాయి? అని ఆరా తీస్తే.. 1.5జీబీ రోజువారీ డేటా ప్లాన్లను వినియోగదారులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆ డేటా ప్లాన్ల రేట్లను పరిశీలించి చేస్తే..

Best Prepaid Plans: బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్సెస్‌ జియో, ఎయిర్‌టెల్‌, వీఐ.. ఏది బెస్ట్‌ అంటే..
Bsnl, Airtel, Vi, Jio, Plans Compared
Madhu
|

Updated on: Aug 08, 2024 | 8:53 AM

Share

టెలికాం రంగం ఇప్పుడు ఒకరకంగా సంది దశలో ఉంది. ఒకపక్క ప్రైవేటు ఆపరేటర్లు ఖర్చు పెరిగాయంటూ ప్లాన్ల ట్యారిఫ్‌లను అమాంతం పెంచేశాయి. భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వోడాఫోన్‌ ఐడియా వంటి సంస్థలు ఉన్నాయి. దీంతో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వినియోగదారులు చూడటం ప్రారంభించారు. ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా 4జీని విస్తరించడం.. 5జీసేవలను కూడా ప్రారంభించడంతో దాని వైపు జనాలు ఆకర్షితులవుతున్నారు. పైగా మిగిలిన ప్రైవేటు ఆపరేటర్లతో పోల్చితే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్ల రేట్లు చాలా తక్కువగా ఉండటం కూడా ఇందుకు మరో కారణంగా ఉంది. ఈ క్రమంలో వాటి రేట్లు అసలు ఎలా ఉన్నాయి? అని ఆరా తీస్తే.. 1.5జీబీ రోజువారీ డేటా ప్లాన్లను వినియోగదారులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆ డేటా ప్లాన్ల రేట్లను పరిశీలించి చేస్తే.. ప్రధాన ప్రైవేటు ఆపరేటర్లు అయిన ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌ ఐడియాతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ రేట్లలో వ్యత్యాసం తెలుస్తుంది. ఏది బెస్టో మీరే డిసైడ్‌ చేసుకోండి.

రిలయన్స్‌ జియో..

జియో రూ.799 ప్లాన్.. ఇది 84 రోజుల వ్యాలిడిటీతోపాటు 1.5జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉన్నాయి. అదనంగా జియో టీవీ, జియో క్లౌడ్‌, జియో సినిమా వంటి జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ ఉంటుంది. అన్‌లిమిటెడ్‌ 5జీని ఈ ప్యాక్‌ ఇవ్వడం లేదు.

భారతీ ఎయిర్‌టెల్..

ఎయిర్‌టెల్ రూ. 859 ప్లాన్‌.. ఇది 84 రోజుల పాటు 1.5జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. ఎయిర్‌టెల్‌ థాంక్స్ రివార్డ్‌ల ప్రయోజనం పొందుతారు. దీనిలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లోని రివార్డ్స్‌ మినీ 123 సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉంటుంది.

వోడాఫోన్‌ ఐడియా..

రూ. 859 ప్లాన్‌.. ఇది 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. 1.5జీబీ రోజువారీ డేటాను ఇస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. అదనంగా, వీఐ వినియోగదారులు వీఐ హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను పొందుతారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌..

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 485 ప్లాన్‌.. ఇది 82 రోజుల పాటు 1.5జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉన్నాయి. మిగతా వాటిలా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్‌తో ఎలాంటి అదనపు ప్రయోజనాలను అందించడం లేదు.

ఇది గుర్తుంచుకోండి..

ప్రస్తుతం మనం చూసిన అన్ని ప్లాన్లలోకెల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ అత్యంతస సరసమైన ఆప్షన్‌. 82 రోజులకు ఇది రూ. 485కే 1.5జీబీ డేటాను అందిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే చాలా ప్రదేశాలలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ, 5జీ కవరేజీ లేదు. దీని తర్వాత తక్కువ ధర అంటే రిలయన్స్‌ జియో అందిస్తుంది. రూ. 799తో 84 రోజుల పాటు 1.5జీబీ రోజువారీ డేటా ఇస్తుంది. దీనితో పాటు జియో, ఎయిర్‌టెల్‌ ఆపరేటర్లు డేటా బూస్టర్లను కూడా అందిస్తున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..