WhatsApp New Feature: వాట్సాప్ వీడియో కాల్‌లో అదిరే ఫీచర్.. ఇకపై రెండు పనులు ఒకేసారి చేయొచ్చు..
వీడియో కాల్ తో పాటు మ్యూజిక్ ఆడియోను కలిసి వినగలిగే సామర్థ్యం ఇప్పుడు కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకంగా, వీడియో కాల్లో ఉన్న ఎవరైనా వారి స్క్రీన్‌ను షేర్ చేసినప్పుడు, వారి పరికరంలో ప్లే చేసే ఆడియో కూడా ఇతర వ్యక్తులకు షేర్ చేయొచ్చు. ఈ ఫీచర్ వ్యక్తిగత కాల్‌లలో కూడా పని చేస్తుందని, వినియోగదారులు సింక్రనైజ్డ్ ఆడియో అనుభవాన్ని ఆస్వాదించవచ్చని నివేదిక చెబుతోంది.

గ్లోబల్ వైడ్ గా అత్యధికంగా మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా యాజమాన్యంలో నడిచే ఈ యాప్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. స్కూల్ పిల్లల నుంచి ఉద్యోగుల వరకూ వ్యాపారుల నుంచి గృహిణుల వరకూ అందరికీ వాట్సాప్ అనేది ఒక అత్యవసర మాధ్యమంగా మారిపోయింది. చాట్స్, స్టేటస్, కాల్స్, వీడియోకాల్స్, చానల్స్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా జనాల్లోకి బాగా వెళ్లింది. అలాగే ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్త పీచర్లను జోడిస్తూ వారి అటెన్షన్ పోనియకుండా కాపాడుకుంటోంది. ఈ క్రమంలో వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్లో వీడియో కాల్ సమయంలోనే మ్యూజిక్ ప్లేయర్ నుంచి ఆడియోను షేర్ చేసేందుకు వినియోగదారులకు అనుమతి ఇస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వాబీటా ఇన్ ఫో ప్రకారం..
వాబీటాఇన్ ఫో(WABetaInfo) ప్రకారం, వీడియో కాల్ తో పాటు మ్యూజిక్ ఆడియోను కలిసి వినగలిగే సామర్థ్యం ఇప్పుడు కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకంగా, వీడియో కాల్లో ఉన్న ఎవరైనా వారి స్క్రీన్‌ను షేర్ చేసినప్పుడు, వారి పరికరంలో ప్లే చేసే ఆడియో కూడా ఇతర వ్యక్తులకు షేర్ చేయొచ్చు. ఈ ఫీచర్ వ్యక్తిగత కాల్‌లలో కూడా పని చేస్తుందని, వినియోగదారులు సింక్రనైజ్డ్ ఆడియో అనుభవాన్ని ఆస్వాదించవచ్చని నివేదిక చెబుతోంది. అంటే ఒకరితో ఒకరు వీడియో కాల్ లో ఉన్నప్పుడు కూడా ఇద్దరూ కలిసి పాటలు వినొచ్చన్నమాట.
కలిసి వీడియో చూడొచ్చు..
ఈ కొత్ ఫీచర్ గ్రూప్లలో ఐక్యాతా భావాన్ని పెంచడంతో పాటు ఒకరితో ఒకరు మరింత సాన్నిహిత్యం పొందేందుకు వీలుంటుందని వాబీటా ఇన్ ఫో చెబుతోంది. అంతేకాక వీడియో కాల్లో ఉన్న వినియోగదారులు కలిసి వీడియోలను కూడా చూసే అవకాశం ఇప్పుడు వచ్చింది. వీడియో కాల్‌ల సమయంలో షేర్ చేసిన ఆడియోతో ప్రయోగాలు చేయవచ్చు, పాల్గొనేవారు వారి వీడియో ప్లేబ్యాక్ అనుభవాలను సింక్రనైజ్ చేయొచ్చు. వర్చువల్ గా మూవీ-చూడడం లేదా కంటెంట్-షేరింగ్ సెషన్‌ను ప్రారంభించడం వంటివి కూడా చేసుకోవచ్చు. రాబోయే వారాల్లో ఈ ఫీచర్ మరింత మందికి అందుబాటులోకి రానుందని నివేదిక పేర్కొంది.
యూజర్ నేమ్..
ఇదిలా ఉంటే, వాట్సాప్ వినియోగదారులు తమ యూజర్ నేమ్ ద్వారా ఇతరులను వెతకడానికి అనుమతించే ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. సెర్చ్ బార్ లో యూజర్ నేమ్ ను ఎంటర్ చేస్తే అవి వచ్చేలా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..