Airtel Post Paid Plan: ఒకే ప్లాన్.. తొమ్మిది మంది వాడుకోవచ్చు! కేవలం రూ. 599కే.. అపరిమిత ప్రయోజనాలు..

జియో చవకైన ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుండటంతో ఎయిర్‌టెల్ కూడా ఎంట్రీ లెవెల్ లోనే అత్యధిక ప్రయోజనాలతో ప్లాన్లను ప్రవేశపెడుతోంది. దీనిలో భాగంగా రూ. 599కే పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. దీనిలో ప్రయోజనాలు చూస్తే వావ్ అనాల్సిందే.

Airtel Post Paid Plan: ఒకే ప్లాన్.. తొమ్మిది మంది వాడుకోవచ్చు! కేవలం రూ. 599కే.. అపరిమిత ప్రయోజనాలు..
Airtel

Updated on: May 27, 2023 | 5:30 PM

భారతీ ఎయిర్‌టెల్. మన దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం కంపెనీల్లో ఒకటి. మెరుగైన నెట్ వర్క్.. సూపర్ స్పీడ్ ఇంటర్ నెట్, అనేక అదనపు ప్రయోజనాలతో వినియోగదారులను తన వైపు తిప్పుకోవడంలో ఎయిర్‌టెల్ నంబర్ వన్ అని చెప్పాలి. ప్రస్తుతం రిలయన్స్ జియోకి, ఎయిర్‌టెల్ మధ్య బీభత్సమైన పోటీ నడుస్తోంది. రెండూ పోటాపోటీగా ప్లాన్లను తీసుకొస్తున్నాయి. రెండు కూడా దేశంలో 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ మెరుగైన ప్లాన్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తన పోటీదారు అయిన జియో చవకైన ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుండటంతో ఎయిర్‌టెల్ కూడా ఎంట్రీ లెవెల్ లోనే అత్యధిక ప్రయోజనాలతో ప్లాన్లను ప్రవేశపెడుతోంది. దీనిలో భాగంగా రూ. 599కే పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. దీనిలో ప్రయోజనాలు చూస్తే వావ్ అనాల్సిందే. కుటుంబ అవసరాలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దింది. ఒకే ప్లాన్ పై ఏకంగా తొమ్మిది కనెక్షన్లను తీసుకునే అవకాశం ఈ ప్లాన్ కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..

ఇదీ ప్లాన్..

ఎయిర్‌టెల్ రూ. 599 ప్లాటినం ఫ్యామిలీ ప్లాన్‌ పేరిట ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. దీనిని కపుల్ ప్లాన్ గా పిలుస్తారు. అంటే ఒకే ప్లాన్‌పై భార్యాభర్తలు ఇద్దరూ ప్రయోజనం పొందవచ్చు. ప్రైమరీ యూజర్ ఈ ప్లాన్ మేనేజ్ చేస్తుంటారు. కావాల్సినప్పుడు మరొక కుటుంబ సభ్యుణ్ని ఈ ప్లాన్‌లో యాడ్ చేసుకోవచ్చు. లేదా ప్లాన్ నుంచి తీసేయవచ్చు. ఈ ప్లాన్‌లోకి కొత్తగా ఎవరు వచ్చినా సెకండరీ యూజర్‌గా పరిగణించాలి. సెకండరీ యూజర్ కోటా కింద ఉన్న డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఉన్న ఇద్దరికీ అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దాంతో పాటు నెల రోజులకు గానూ ఇద్దరికి 105 జీబీ డేటా వరకు లభిస్తుంది. అందులో మళ్లీ 75 జీబీ ప్రైమరీ యూజర్‌ లభిస్తుండగా.. మిలిగిన 30 జీబీ డేటా సెకండరీ యూజర్‌ కోటా కింద ఉంటుంది. ఒక వేళ ఈ డేటాను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతే మరుసటి నెలకు బదిలీ చేసుకోవచ్చు. గరిష్ఠంగా 200 జీబీ వరకు బదిలీ చేసుకునే వీలుండడం గమనార్హం.

తొమ్మది యాడ్ ఆన్ కనెక్షన్లు..

ప్రైమరీ, సెకండరీ యూజర్లతో పాటు మరో 8 మంది వరకు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ప్రతి కనెక్షన్‌కు రూ.299 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి వ్యక్తికి 30 జీబీ డేటా అదనంగా వస్తుంది. పైగా అన్ని ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లపై పరిచయ ప్రయోజనంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఆస్వాదించవచ్చు. అందువల్ల, ఏదైనా 5G డేటా వినియోగం ప్లాన్ డేటా కోటా కింద పరిగణించబడదు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5G ప్లస్ 3000 నగరాల్లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ఓటీటీ ప్రయోజనాలు..

ఈ ప్లాన్ తీసుకున్న వారికి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ ఆరు నెలల సభ్యత్వం లభిస్తుంది. అలాగే ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్, ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ లభిస్తాయి. అంతేకాక ఉచితంగా హలో ట్యూన్స్, వింక్ ప్రీమియం, ఏడాది పాటు అపోలో 24/7 సేవలు పొందవచ్చు. అలాగే ఎయిర్ టెల్ స్టోర్లు, కస్టమర్ కేర్ సెంటర్లలో వీఐపీ సర్వీస్ కింద ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.

మెరుగైన సర్వీస్..

ఎయిర్‌టెల్ దాని ప్లాటినం కస్టమర్‌లకు ప్రాధాన్యతనిస్తుంది. వారికి ప్రత్యేకమైన వీఐపీ సేవలను అందిస్తుంది. ‘ప్రియారిటీ సర్వీస్’తో, ప్లాటినం కస్టమర్‌లు ఎయిర్‌టెల్ కాల్ సెంటర్‌లు, స్టోర్‌లలో ప్రిఫరెన్షియల్ కస్టమర్ సపోర్ట్‌ను పొందవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..