Top Free Apps: గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ 5 ఫ్రీ యాప్స్.. ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసుకున్నవి ఇవే..

గూగుల్ ప్లే స్టోర్ ప్రతీవారం టాప్ డౌన్‌లోడెడ్ యాప్స్ వివరాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇటీవల ఏఐ వినియోగం ఎక్కువైంది. అందరూ తమ పనుల్లో భాగంగా ఏఐ యాప్స్‌ను బాగా వాడుతున్నారు. దీంతో ఏఐ టూల్స్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్ యాప్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

Top Free Apps: గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ 5 ఫ్రీ యాప్స్.. ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసుకున్నవి ఇవే..
Google Top Apps

Updated on: Nov 23, 2025 | 11:37 AM

ఆండ్రాయిండ్ ఫోన్ వాడుతున్న ప్రతిఒక్కరీ సుపరిచితమైన పేరు గూగుల్ ప్లే స్టోర్. ఏదైనా అప్లికేషన్ అవసరమైతే వెంటనే గూగుల్ ప్లే స్టోర్‌ గుర్తుకొస్తుంది. వెంటనే యాప్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన అప్లికేషన్‌న ఇన్‌స్టాల్ చేసుకుంటాం. యాప్ రివ్యూలు, రేటింగ్స్ కూడా ఇందులో చూసుకోవచ్చు. కేవలం సెక్యూర్ కలిగిన యాప్‌లు మాత్రమే ప్లే స్టోర్‌లో ఉంటాయి. అందుకే ఇక్కడి నుంచ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవడం భద్రంగా ఉంటుంది గేమింగ్,బుక్స్, మూవీస్ లాంటి అనేక యాప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

తాజాగా ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసుకున్న ఫ్రీ యాప్‌ల వివరాలను గూగుల్ బయటపెట్టింది. అందులో ఛాట్‌జీపీటీ, స్టోరీ టీవీ, మీషో, కుక్కూ టీవీ,గూగుల్ జెమినీ ఉన్నాయి. ఇటీవల ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది,. ఇందకముందు ఏదైనా సమాచారం కావాలంటే నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేశారు. కానీ ఇప్పుడు ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాక సమాచారం కోసం వాటిని ఉపయోగిస్తున్నారు. దీంతో ఏఐ టూల్స్ ప్లే స్టోర్‌లో టాప్‌లో ఉంటున్నాయి. ఇటీవల గూగుల్.. జెమినీ 3 పేరుతో కొత్త వెర్షన్‌న అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందులో అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించింది. దీంతో గూగుల్ జెమినీ యాప్ ఇన్‌స్టాల్స్ పెరిగిపోయాయి.

ఇక ఛాట్‌జీపీటీ కూడా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లను తీసుకొస్తుంది. దీంతో ఆ యాప్ డౌన్‌లోడ్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఛాట్ జీపీటీ, గూగుల్ జెమినీ మధ్య తీవ్ర పోటీ నెలకుందని దీని ద్వారా మనం చెప్పవచ్చు. ఇక మీషోలో రీసెల్లింగ్ ఆప్షన్ ఉంది. దీని ద్వారా మీరు ఆదాయం సంపాదించుకోవచ్చు. మీకు నచ్చిన ప్రొడక్ట్స్‌ను ఫ్రెండ్స్ లేదా వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయొచ్చు. ఆ లింక్ ద్వారా ఎవరైనా కొనుగోలు చేస్తే మీకు ఆదాయం లభిస్తుంది. ప్లే స్టోర్‌లో 4.4 స్టార్ రేటింగ్‌తో మీషో కొనసాగతోంది.