Google Chrome: గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా..? అయితే ఈ అలర్ట్ మీ కోసమే..
Google Chrome: గూగుల్ బ్రౌజర్‌ను వాడుతున్నారా..? అయితే ఈ అలర్ట్ మీ కోసమే. తక్షణమే అప్రమత్తం కాకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మేరకు గూగుల్
Google Chrome: గూగుల్ బ్రౌజర్‌ను వాడుతున్నారా..? అయితే ఈ అలర్ట్ మీ కోసమే. తక్షణమే అప్రమత్తం కాకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మేరకు గూగుల్ తమ వినియోగదారులను అలర్ట్ చేసింది. హ్యాకర్ల నుంచి రక్షించుకునేందుకు వినియోగదారులు తక్షణమే Google Chrome బ్రౌజర్‌లో సెక్యూరిటీ అప్‌డేట్‌ను వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. వినియోగదారుల కోసం సెక్యూరిటీ ప్యాచ్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. అయితే హ్యాకింగ్ ప్రమాదాన్ని నివారించడానికి క్రోమ్‌ను త్వరగా అప్‌డేట్ చేయాలని గూగుల్ వినియోగదారులకు సూచించింది. CVE-2022-3075′ బగ్ ఉందని గుర్తించామని తెలిపింది. అయితే గూగుల్ క్రోమ్ వెర్షన్ 105ను ఆగస్టు 30న విడుదల చేసిన కొన్ని రోజులకే ఈ తాజా అప్‌డేట్ వచ్చింది.
సెక్యూరిటీ బగ్‌లు చేరకుండా నిరోధించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపింది. విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో గూగుల్ క్రోమ్ వినియోగదారుల కోసం సెక్యూరిటీ ప్యాచ్‌ను విడుదల చేసినట్లు తెలిపింది. ఇతర ప్రాజెక్టులపై ఆధారపడి థర్డ్ పార్టీ లైబ్రరీలో బగ్ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వాటిపై తాము చర్యలు చేపడతామని తెలిపింది.
కాగా, ఈ మధ్య కాలంలో యూజర్లు హ్యాకింగ్ గురవుతున్నారు. యూజర్లు హ్యాకింగ్ గురి కాకుండా గూగుల్ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ముందస్తుగా తమ వినియోగదారులను అప్రమత్తం చేస్తోంది. తాజాగా హ్యాకర్ల చొరబడుతున్న నేపథ్యంలో గూగుల్ క్రోమ్‌ను ముందస్తుగానే సెక్యూరిటీ అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి