Google Play Store: ప్లే స్టోర్ నుంచి ప్రమాదకరమైన 150 యాప్స్ ఔట్.. మీ ఫోన్‌లో ఇవి ఉన్నాయో చెక్ చేసుకోండి..

|

Oct 28, 2021 | 10:12 PM

Google Play Store: గూగుల్ ప్లే స్టోర్ నుంచి 150కి పైగా హానికరమైన యాప్‌లను తొలగించడం జరిగింది. ప్లే స్టోర్ నుండి Google తీసివేసిన యాప్‌లు యూజర్లకు..

Google Play Store: ప్లే స్టోర్ నుంచి ప్రమాదకరమైన 150 యాప్స్ ఔట్.. మీ ఫోన్‌లో ఇవి ఉన్నాయో చెక్ చేసుకోండి..
Play Store
Follow us on

Google Play Store: గూగుల్ ప్లే స్టోర్ నుంచి 150కి పైగా హానికరమైన యాప్‌లను తొలగించడం జరిగింది. ప్లే స్టోర్ నుండి Google తీసివేసిన యాప్‌లు యూజర్లకు హానీ తలపెట్టేలా ఉన్నాయని, ఆ కారణంగానే గూగుల్ వాటిని నిషేధించిందని నిపుణులు పేర్కొన్నారు. అవాస్ట్ యాంటీవైరస్ బ్లాగ్ ప్రకారం.. యాప్‌లు యూజర్ల నుంచి డబ్బు దండుకోవడం వ్యక్తిగత సమాచారం సేకరించడం వంటివి చర్యలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ హానికరమైన యాప్‌లను ప్రపంచ వ్యాప్తంగా 10.5 మిలియన్ కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు యూజర్లు.

కాగా, “ప్రస్తుతం కనుగొన్న యాప్‌లు UltimaSMS ప్రచారంలో భాగంగా ఉన్నాయి. వీటిలో 151 యాప్‌లు Google Play స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లను 10.5 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేయడం జరిగింది. రూపురేఖల్లో డూప్లికేట్ యాప్‌లు, ఒరిజినల్ యాప్‌లు దాదాపు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా ప్రీమియం SMS స్కామ్ ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి నకిలీ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీని వెనుక పెద్ద స్కామ్ ఉండొచ్చని భావిస్తున్నాం. అందుకే ఈ ప్రచారానికి ‘‘UltimaSMS’’ అని పేరు పెట్టాం. కనుగొన్న మొదటి నకిలీ యాప్‌లలో ఒకటి అల్టిమా కీబోర్డ్ 3D ప్రో పేరుతో ఉంది.’’ అని అవాస్ట్ బ్లాగ్‌లో సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు.

ఈ యాప్‌లు యూజర్లకు సంబందించి అన్ని వివరాలను సేకరిస్తుంది. ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్లు సేకరిస్తాయి. నకిలీ యాప్‌లలో కస్టమ్ కీబోర్డ్‌లు, క్యూఆర్ కోడ్ స్కానర్‌లు, వీడియో, ఫోటో ఎడిటర్‌లు, స్పామ్ కాల్ బ్లాకర్లు, కెమెరా ఫిల్టర్‌లు, గేమ్‌ యాప్స్ లతో సహా అనేక రకాల ఫీచర్లను కలిగి ఉంటాయి. ఇటువంటి యాప్‌లను 80 దేశాలకు చెందిన వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. యాప్‌లను ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ వంటి మధ్యప్రాచ్యంలోని వినియోగదారులు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత యూఎస్, పోలాండ్‌లోని వినియోగదారులు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Also read:

Personal Loans: పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి..

T20 World Cup2021: 45 నిమిషాల పాటు కోహ్లీ బ్యాటింగ్.. కన్ను ఆర్పకుండా చూసిన ఇషాన్, శ్రేయాస్..

CM Ramesh: బీజేపీ-టీడీపీ పొత్తుపై సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు