Google Meet: గూగుల్ మీట్ నుంచి ఆసక్తికరమైన ఫీచర్.. ఇకపై కాల్స్‌లో మాట్లాడే సంభాషణలను..
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పెరిగిన తర్వాత ఆన్‌లైన్ వీడియో కాల్స్‌కు డిమాండ్ పెరిగింది. పాఠశాలల నుంచి కంపెనీల వరకు ఆన్‌లైన్ మోడ్‌ను ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ కాలీంగ్ ప్లాట్‌ఫామ్స్‌కు భారీగా క్రేజ్ వచ్చింది. దీంతో రకరకాల ఫీచర్లతో యూజర్లను...
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పెరిగిన తర్వాత ఆన్‌లైన్ వీడియో కాల్స్‌కు డిమాండ్ పెరిగింది. పాఠశాలల నుంచి కంపెనీల వరకు ఆన్‌లైన్ మోడ్‌ను ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ కాలీంగ్ ప్లాట్‌ఫామ్స్‌కు భారీగా క్రేజ్ వచ్చింది. దీంతో రకరకాల ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి టెక్ దిగ్గజాలు. ఇందులో భాగంగా తాజాగా గూగుల్ మీట్ యూజర్ల కోసం ఓ అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తోంది. సాధారణంగా గూగుల్ మీట్‌లో అవతలి వ్యక్తి చెబుతున్న పాయింట్స్‌ను నోట్ చేసుకోవాల్సి వస్తే ఏం చేస్తారు. ఏముంది పేపర్, పెన్న తీసుకొని రాసుకుంటాం అంటారా.? అయితే ఇకపై ఆ అవసరం లేకుండా గూగుల్ మీట్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.
ఈ ఫీచర్ సహాయంతో మీట్ కాల్స్‌లో జరిగే సంభాషణలను టెక్ట్స్‌గా మార్చుకుని, గూగుల్ డాక్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో వీటిని గూగుల్ డ్రైవ్ నుంచి యాక్సెస్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. కాల్ ట్రాన్స్‌స్క్రైబ్ పేరుతో ఈ ఫీచర్‌ను పరియం చేయనున్నారు. దీనిద్వారా గూగుల్ మీట్‌లో వీడియో కాల్ మొదలైన తర్వాత కాల్ ట్రాన్స్‌స్క్రైబ్ అవుతున్నట్లు యూజర్లు తెలియజేస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, సమావేశంలో చర్చించుకుంటున్న అంశాలను రికార్డు చేయడం ప్రారంభిస్తుంది. మీటింగ్ ముగిసిన వెంటనే రికార్డు చేసిన ఆడియోను టెక్ట్స్‌గా మారుస్తుంది.
అనంతరం ఈ టెక్ట్స్ డ్రైవ్ స్టోరేజ్‌లో ఉండే మీట్ రికార్డింగ్స్ అనే ఫోల్డర్‌లో సేవ్ అవుతుంది. గూగుల్ మీట్‌లో పాల్గొన్న సభ్యులెవరైనా సదరు ఫోల్డర్‌ని యాక్సెస్ చేసేలా అవకాశం కల్పించనున్నారు. అక్టోబర్ 24 నుంచి ఎంపికచేసిన కొందరికి అందుబాటులోకి తీసుకొచ్చి, తర్వాత అందరికీ అందించనున్నారు. మరి ఈ ఫీచర్‌తో గూగుల్ ఎలాంటి ఒరవడి సృష్టిస్తుందో చూడాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..