Google Update: మరో ఇంట్రస్టింగ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన గూగుల్‌.. ఇక తప్పుల తిప్పలు తప్పినట్టే..!

మనం ఏదైనా రాసినప్పుడు అందులో వ్యాకరణ ధోషాలు వస్తే నలుగురిలో చులకన అవుతామనే భావన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి గూగుల్‌పై ఆధారపడడం సర్వ సాధారణమైపోయింది. గూగుల్‌ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా గూగుల్‌ వ్యాకరణ తనిఖీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌ ద్వారా తప్పులు లేకుండా వాక్య నిర్మాణం చేయవచ్చు.

Google Update: మరో ఇంట్రస్టింగ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన గూగుల్‌.. ఇక తప్పుల తిప్పలు తప్పినట్టే..!
Google Search

Updated on: Aug 08, 2023 | 8:30 PM

మనం సాధారణంగా ఏదైనా లెటర్‌ రాసినా.. లేదా ఎవరికైనా అప్లికేషన్‌ పంపాలన్నా ఇంగ్లిష్‌లో లెటర్‌ రాస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరగడంతో అన్ని మెయిల్స్‌ ద్వారా సంభాషణలు చేస్తుంటాం. అలాగే వాట్సాప్‌ వంటి యాప్స్‌లో చాటింగ్‌ చేస్తాం. అయితే ఇక్కడ అందరినీ వేధించే సమస్య తప్పులు. అవును మీరు విన్నది నిజమే మనం ఏదైనా రాసినప్పుడు అందులో వ్యాకరణ ధోషాలు వస్తే నలుగురిలో చులకన అవుతామనే భావన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి గూగుల్‌పై ఆధారపడడం సర్వ సాధారణమైపోయింది. గూగుల్‌ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా గూగుల్‌ వ్యాకరణ తనిఖీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌ ద్వారా తప్పులు లేకుండా వాక్య నిర్మాణం చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో? ఓ సారి తెలుసుకుందాం.

గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్ సెర్చ్’లో గ్రామర్ చెక్ ఫీచర్‌ను జోడించింది. ఒక పదబంధాన్ని లేదా వాక్యాన్ని సెర్చ్‌ బార్‌లో పేస్ట్‌ చేసి ఈ గ్రామర్‌ చెక్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవాచ్చు. ముందుగా గూగుల్‌ సెర్చ్‌లో గ్రామర్‌ చెక్‌ అని సెర్చ్‌ చేయాలి. అక్కడ కనిపించే లింక్స్‌ మొదటి విభాగంలో క్లిక్‌ చేసి గ్రామర్‌ చెక్‌ ఫీచర్‌ను చూడవచ్చు. అక్కడ మన సెంటెన్స్‌ను కాపీ లేదా టైప్‌ చేస్తే ఇంకో బాక్సులో వ్యాకరణ దోషాలు లేని వ్యాక్యాని చూడవచ్చు. అలాగే దాన్ని కాపీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా గూగుల్‌ వాక్యాన్ని సవరించి, మార్పులను హైలైట్ చేస్తుంది. ఈ సాధనాన్ని ఉపయోగించి స్పెల్లింగ్ లోపాలు కూడా సరిచేసుఓవచ్చు. అయితే వ్యాకరణ తనిఖీలు 100 శాతం కచ్చితమైనవి కాకపోవచ్చు, ముఖ్యంగా పాక్షిక వాక్యాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంంటున్నారు. 

అలాగే మనం గూగుల్‌కు అందించే కంటెంట్‌ గూగుల్‌ కంటెంట్‌ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి లేకపోతే వ్యాకరణ తనిఖీ జరగదని గుర్తుంచుకోవాలి. అని టెక్ దిగ్గజం హెచ్చరించింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన సపోర్ట్ పేజీ మొదట గత నెల చివర్లో అందుబాటులోకి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు వారి వ్యక్తిగత సమాచారం, గోప్యత మరియు ఆన్‌లైన్ భద్రతపై నియంత్రణను ఉంచుకోవడంలో సహాయపడటానికి గత వారం టెక్ దిగ్గజం శోధనలో కొత్త ఫీచర్‌లను ప్రకటించింది, ఇందులో వారి ప్రైవేట్ సంప్రదింపు సమాచారం ఆన్‌లైన్‌లో కనిపించినప్పుడు వినియోగదారులను హెచ్చరించే ఫీచర్ కూడా ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి