Job News : ప్రతిష్టాత్మక గెయిల్ GAIL (Gas Authority of India Ltd.) సంస్థ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో మొత్తం 25 ఖాళీలను ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులను గేట్ 2021 లో సాధించిన స్కోర్‌ల ద్వారా నియమించుకోవాలని నిర్ణయించారు. డిగ్రీలో రసాయన, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాలలో 65 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు ఫారాలను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 16. అన్ని విద్యార్హతలు యుజిసి, ఎఐసిటిఇ ఆమోదించిన పూర్తిస్థాయి రెగ్యులర్ కోర్సులే అయి ఉండాలి. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ నాటికి దరఖాస్తుదారుల వయోపరిమితి 26 సంవత్సరాలు మించరాదు. గేట్ 2021 స్కోరు ఆధారంగానూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ నియామక ప్రక్రియకు గేట్-2021లో సాధించిన స్కోరు మాత్రమే చెల్లుతుంది. 2020 యొక్క గేట్ స్కోరు లేదా అంతకు ముందు వచ్చిన స్కోర్ చెల్లదని గెయిల్ సదరు ఉద్యోగ ప్రకటనలో పేర్కొంది.
దరఖాస్తు ఫారమ్ ఆన్ లైన్లో సమర్పించిన తరువాత, అభ్యర్థులు దాని ప్రింటౌట్ తీసుకొని, పాస్ పోర్ట్ సైజు ఫోటోను అతికించి సెల్ఫ్ అటస్టేషన్ చేయాలి. ఇంటర్వ్యూ రౌండ్లో మాత్రమే ఈ దరఖాస్తు ఫారమ్ చూపించాల్సి ఉంటుంది. అంతేకాని, అభ్యర్థులు ఆన్‌లైన్ లో తీసుకున్న దరఖాస్తు ప్రింటవుట్ ను గెయిల్ (ఇండియా) లిమిటెడ్ యొక్క ఏ కార్యాలయానికి పంపకూడదని ఉద్యోగ నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
Read also : విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్ష భగ్నం, తెల్లవారుజామున హాస్పిటల్ కి తరలించిన పోలీసులు