Car AC: కారులో ఏసీ ఉన్నా చల్లగా ఉండటం లేదా.. అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..!

|

May 27, 2022 | 11:25 AM

Car AC: వేసవిలో కారులో ఏసీ పనిచేయకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల కారు వెనకాల కూర్చున్నవారు కూడా ఉక్కపోతకి గురవుతారు. అయితే ఒక్కోసారి ఏసీ ఆన్‌లోనే ఉంటుంది

Car AC: కారులో ఏసీ ఉన్నా చల్లగా ఉండటం లేదా.. అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..!
Car Ac
Follow us on

Car AC: వేసవిలో కారులో ఏసీ పనిచేయకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల కారు వెనకాల కూర్చున్నవారు కూడా ఉక్కపోతకి గురవుతారు. అయితే ఒక్కోసారి ఏసీ ఆన్‌లోనే ఉంటుంది కానీ కారులోపల చల్లగా ఉండదు. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. ఏసీ మంచి కూలింగ్ ఇస్తూ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. అన్నింటిలో మొదటిది తరచుగా కారు ఏసీని తనిఖీ చేస్తూ ఉండాలి. కారు రేడియేటర్‌ని కూడా చెక్ చేయాలి. వాటిలో ఏమైనా ఇబ్బందులో ఉంటే వెంటనే క్లియర్ చేయాలి.

2. బహిరంగ ప్రదేశంలో కారును పార్క్ చేస్తున్నప్పుడు కారు కిటికీలను తెరిచి ఉంచాలి. తద్వారా దానిలోని వేడి బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు కారులో ఏసీ ఆన్‌ చేస్తే తొందరగా కూల్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి

3. కారుని ఏదైనా షెడ్ కింద పార్క్‌ చేయాలని గుర్తుంచుకోండి. తద్వారా కారు చల్లగా ఉంటుంది. దీనివల్ల వాహనం నడిపేటప్పడు ఏసీ ఆన్‌ చేస్తే లోపల చల్లగా ఉంటుంది.

4. AC ఆన్ చేసే ముందు కారు కిటికీలను కొద్దిగా తగ్గించి క్యాబిన్‌లో ఉన్న వేడి గాలిని బయటకు వెళ్లనివ్వండి. తర్వాత ఏసీని ఆన్‌ చేస్తే అది మరింత కూలింగ్ ఇవ్వడమే కాకుండా వేగంగా కారు మొత్తం చల్లబడుతుంది.

5. క్యాబిన్ నుంచి వేడి గాలిని బయటకు పంపి చల్లటి గాలిని ఇచ్చే ప్రక్రియలో కారు AC కండెన్సర్ కచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే AC కండెన్సర్ సరిగ్గా పని చేయకపోతే క్యాబిన్‌ త్వరగా చల్లబడదు. కాబట్టి ఏసీ కండెన్సర్ శుభ్రంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి